షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ ను ఆరంభించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ వరుస విరామాలల్లో వికెట్లను నష్టపోయింది. ధవన్(5), పృథ్వీ షా(19), పంత్(5) మరోమారు విఫలమైనా శ్రేయాస్ అయ్యర్, స్టోనిక్స్, హెత్మయిర్ క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో అలరించారు. చివరి ఓవర్లలలో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణిత 20 ఓవర్లలలో 184 పరుగులు చేసింది.
సత్తా చాటిన బౌలర్లు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ను ఢిల్లీ బౌలర్లు తమ బౌలింగ్ తో హడలెత్తించారు. స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ సత్తమేరకు రాణించలేకపోయారు. మరోవైపు జైశ్వాల్ టీ20 స్థాయిలో రాణించకపోవడంతో సాధించవలసిన రన్ రేట్ పెరిగిపోయింది. దీంతో ఒత్తిడి తట్టుకోలేని రాజస్థాన్ ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. సంజు శాంసన్, మహిపాల్ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 100 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. ఈ దశలో రాహుల్;తెహతియా ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో రాజస్తాన్ 138 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ విజయంతో ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ 5 విజయాలతో 10 పాయింట్లు సొంతం చేసుకుంది. (+1.267) రన్ రేట్ తో ఈ జట్టు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఢిల్లీ చేతిలో ఘోర పరాజయంతో పాయింట్స్ టేబుల్ లో 7వ స్థానానికి చేరుకుంది. కేవలం 4 పాయింట్లతో రాజస్థాన్ క్వాలిఫైయర్ దశ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.