చైనాలో మన ‘బాహుబలి’ ఇరగ ఆడేయటానికి, మన బాహుబలి ప్రతిభతో పాటు, చైనీయులకు ఇలాంటి భారీ, యాక్షన్ పీరియాడికల్ సినిమాల మీద ఉన్న మోజు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు సినిమా రంగం కుదేలైంది. హాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిస్టోఫర్ నోలన్ ‘ టెనెట్’ సినిమా కూడా , జనాన్ని థియేటర్స్ కి రప్పించ లేకపోయింది. ఆగస్టులో రిలీజైన ‘ టెనెట్’ సినిమా కేవలం 250 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కనీసం ఇంకో 500 మిలియన్ల డాలర్లు వసూలు చేస్తే కానీబ్రేక్ ఈవెన్ కాదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులల్లో ఒక చైనీస్ సినిమా 2020 సంవత్సరానికి గాను అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ఆ సినిమా పేరు ‘800’. ఈ 800 సినిమా డైరెక్టర్ గా హువుకు పదేళ్ల కల. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైన్యంతో చైనీస్ సైనికులు షాంగై నగరాన్ని, ప్రజలని కాపాడటానికి చేసిన ఓ యుద్ధం. ఈ యదార్థ సంఘటన ఆధారంగా 800 సినిమా రూపొందించారు. వాస్తవానికి మూడు వందల మంది సైనికులు మాత్రమే షాంగై నగరం వేర్హౌస్ లో దాక్కుని యుద్ధం చేస్తారు. కానీ పోరాటంలో 800 మంది సైనికులు పాల్గొన్నట్లు శత్రువులని నమ్మించారు. కొన్ని రోజుల పాటు మాత్రమే జరిగిన ఈ చరిత్రతాత్మక పోరాటం చైనా ఎప్పటికీ మరచిపోనిది.
అందుకే దర్శకుడు గాన్ హువు , పదేళ్ళ పాటు పరిశోధన చేసి కథను తెరపైకి ఎక్కించాడు. మూడేళ్లు పట్టింది సినిమా పూర్తి చేయడానికి. ఆసియా దేశాల్లోనే మొదటిసారి ఐమాక్ కెమెరాలతో సినిమాని చిత్రీకరించారు. ఆగస్టు 21 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 337 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. నిజానికి ఈ 800 సినిమా గత ఏడాదికే పూర్తయినా, చైనా ప్రభుత్వం ఈ సినిమా విడుదల కావడానికి పలు ఆంక్షలు పెట్టింది. అక్కడ సినిమా రంగానికి సంబంధించి సెపరేట్ పొలిట్ బ్యూరో ఉంటుంది. వాళ్ళు అంగీకరించిన తర్వాతే సినిమా రిలీజవుతుంది.
– తోట ప్రసాద్