హీరోయిన్ గా పదికాలాల పాటు వెండితెరను ఏలాలంటే.. ఎప్పుడూ ఫిట్ నెస్ తోనే ఉండాలి. అలాగే.. సన్నజాజి తీగెలాంటి ఆకృతిలో శరీరాన్ని మలుచుకోవాలి. ఈ ఫార్ములాని ఫాలో అయిన చాలా మంది ముద్దుగుమ్మలు.. ఎప్పుడూ అవకాశాల్ని అందుకుంటారు. అలా నిత్యం జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ.. మరో పక్క యోగా పాఠాలు ఫాలో అవుతూ జీరో సైజు బాడీతో మెప్పించే బ్యూటీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయొచ్చు.

రకుల్ ప్రీత్ సింగ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ .. తమ హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేయడానికే అన్నట్టుగా ఇన్ స్టా గ్రామ్ ను యూజ్ చేస్తుంటే.. రకుల్ ప్రీత్ మాత్రం తన వర్కవుట్స్ ను, యోగా విన్యాసాల్ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకోడానికి ఇష్టపడుతుంది. తరచుగా ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోసే దానికి నిదర్శనం. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఈ పాండమిక్ టైమ్ లో ఒత్తిడిని అధిగమించడానికి యోగాను దానికి ఎలా సాధనంగా వాడుకోవచ్చో టిప్ప్ ఇస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. జిమ్ లో ఫ్లోర్ మీద పడుకొని కళ్లు మూసుకొని.. చేతులు చాచి విశ్రాంతి తీసుకుంటున్నట్టు రివీలైంది. నేను నిద్ర పోవడం లేదు. వాల్నెస్ ఎక్స్ పెర్ట్ మున్ మున్ గనెరివాల్ సూచించినట్టు .. వ్యాయామం తర్వాత యోగా నిద్ర సెషన్ లో నేను ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. కోవిడ్ లోని ఒత్తిడిని అధిగమించడానికి, ఆందోళన ను పోగొట్టుకోడానికి యోగా నిద్ర దానికి చక్కటి మందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. సో మొత్తానికి ఈ యోగా సూత్రాలతో రకుల్ .. తన పేరును యోగా ప్రీత్ సింగ్ గా మార్చుకుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












