హెచ్ పీసీఎల్ అగ్నిప్రమాద ఘటన మరువకముందే.. విశాఖలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖలోని సింహాచలంలో ట్రాన్స్ కో సబ్ స్టేషన్ గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్ కు పరిధిలో ఒక చోట మంటలు రావడంతో… అవి కాస్తా సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్లకు అంటుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడం మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అర్పివేశారు. ప్రమాదం ఎలా జరిగింది అనే కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనను పూర్తిగా పరిశీలించి నష్టం అంచనా వేస్తామని అధికారులు వెల్లడించారు.
జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...











