టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ .. గుణశేఖర్ ఇటీవల ‘శాకుంతలం’ పౌరాణిక చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల రమణీయ ప్రణయగాథ ఈ సినిమాకి ఆధారం. పాన్ ఇండియా కేటగిరిలో అత్యంత భారీగా.. కళ్ళు చెదిరే సెట్స్ తో.. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం గుణశేఖర్ హిమాలయాల్లో ఒక బ్రహ్మాండమైన సెట్ వేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇందులోని శకుంతల పాత్ర కోసం పూజా హెగ్డే , అనుష్క శెట్టి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గుణశేఖర్ ఇంకా కథానాయిక పేరును అఫీషియల్ గా ప్రకటించకపోవడంతో అది కేవలం రూమర్స్ గానే పరిగణించాల్సి వస్తోంది. తన కుమార్తె నీలిమా గుణను ఈ సినిమాతో నిర్మాతగా అనౌన్స్ చేశారు గుణశేఖర్. మరి ఇందులో శకుంతల , దుష్యుంతులుగా నటించేది ఎవరో చూడాలి.











