టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున .. ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో వైల్డ్ డాగ్, బంగార్రాజు లాంటి సినిమాలతో బిజీగా ఉన్న నాగ్.. మరో పక్క ‘బ్రహ్మాస్త్ర’ అనే బ్రహ్మాండమైన బాలీవుడ్ మూవీకి కమిట్ అయ్యారు. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో విడుదల కాబోతోంది. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ లాంటి మహామహులతో నాగ్ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.
ఇదిలా ఉంటే.. నాగ్ కు ఈ సినిమా లో నటిస్తున్న క్రెడిట్ తో బాలీవుడ్ లో మరో సినిమా ఆఫర్ వచ్చిపడింది. ఇందులో ఆయన పాత్ర నెగెటివ్ టచ్ తో ఉంటుందని సమాచారం. ఇంచుమించు ధూమ్ లో హృతిక్ రోషన్ పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడట. నిజానికి నాగ్.. ‘శివ, ఖుదాగవా, ద్రోహి, క్రిమినల్, అంగారా, జక్మ్ , అగ్నివర్ష’ లాంటి మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాస్త్ర తో పాటు మరో సినిమా కూడా చేయనుండడం.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.











