‘కేంద్రం వైఫల్యాలను ఓటర్లకు తెలిసేలా చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి. బీజేపీ అసత్య ప్రచారాలను ప్రజలకు తెలిసేలా తెలియజేయండి. బీజేపీ పాలనలో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను ప్రజలకు గుర్తుచేయాలి. అంతేకాదు.. వారి వల్ల తెలంగాణ యువత ఉద్యోగాలు కోల్పోయిందని.. వాటి గురించి కూడా ప్రజలకు తెలిసేలా వివరించాలి. బీజేపీ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్లు పెడుతుందని.. దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించాలి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. ఆ పార్టీకి చరిత్ర ఉంది కానీ.. భవిషత్తు లేదనే విషయాన్ని ముందు మనం గ్రహించి.. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ వారిని ఎంచుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కేటీఆర్ పార్టీ శ్రేణులను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం చేశారు.
ప్రకాశంపై బోటు బాంబు నిజమే..!! ఆ నీచుడు దొరికాడు..!!
విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర...