ఓ అభిమాని తన అభిమాన్నాన్ని విచిత్రంగా చాటుకున్నాడు. ఆ అభిమానం ముదిరి కాస్త పైత్యంగా మారింది. కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను ఏకంగా తన శరీరంపై రెండు చోట్ల వేయించుకుని రామాంజనేయులు అనే టీఆర్ఎస్ కార్యకర్త తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు.
అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో సినిమా హీరోలకు, నటులకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులకూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటున్నారు. తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సరిగ్గా ఇలానే రామాంజనేయులు అనే టీఆర్ఎస్ కార్యకర్త తన ఛాతిపై కేటీఆర్, కేసీఆర్ చిత్రాలను వేయించుకుని తన అభిమానాన్ని ఔరా అనిపించుకునేలా చాటుకున్నారు.
టీఆర్ఎస్ కార్యకర్త తన ఛాతీపై వేయించుకున్న పచ్చబొట్లను చూసి మంత్రి కేటీఆర్ విస్మయం చెందారు. ఇలాంటి సహసాన్ని ఎవరూ చేయొద్దని అతనితోపాటు, కార్యకర్తలను సూచించారు. ప్రగతిభవన్ వద్ద సోమవారం కలిసిన రామాంజనేయులు తన చొక్కా విప్పి ఛాతీపై, వెన్నుపై ఉన్న పచ్చబొట్లను కేటీఆర్‌కు చూపించారు. అనంతరం ట్విట్టర్‌లోనూ దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని హితవు పలికారు. దీనిపై కొందరు ఇలా కామెంట్లు కూడ చేస్తున్నారు..పైత్యం బాగా పెరిగిపోయిందని.