భగవంతునికి, భక్తులకు మధ్య వారిధిగా ఉండే పూజారి భక్తురాలైన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. 46 ఏండ్ల కామాంధుడి చూపు 16 ఏళ్ల బాలికపై పడింది. బాలికతో అర్చకుడు చెప్పిన ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో కటకటాలపాలయ్యాడు.
ప్రత్యేక పూజల పేరుతో ఓ పూజారి.. 16 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఏవో మందుగోలీలు తనతో మింగించి రాత్రి నగ్నంగా పూజలు చేయాలి.. మళ్లీ రమ్మన్నాడు. ఇంటికి వెళ్లిన ఆ బాలిక వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మాయమాటలు చెప్పి బాలికతో అసభ్యంగా ప్రవర్తంచినందుకు అర్చకుడిని మల్కాజ్‌గిరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గుడిలో చింతపల్లి వెంకటేశ్వర శర్మ(46) అర్చకుడు. అక్టోబర్ 17వ తేదీ నుంచి 16 ఏళ్ల ఓ బాలిక అమ్మవారి దీక్ష తీసుకుని పూజలు చేస్తోంది. ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పడంతో ఆదివారం సాయంత్రం బాలిక గుడికి వచ్చింది. చీకట్లో ఆ బాలికతో ఏవో మాత్రలు మింగించాడు. రాత్రి నగ్నంగా పూజలు చేయాలని, మళ్లీ రావాలని పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలిక మాత్రల ప్రభావంతో వాంతులు చేసుకుంది. కుటుంబ సభ్యులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూజారిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.