వేల కోట్ల అప్పుల్లోకి ఏపీ వైద్యం రంగం ..!
ఏపీలో వైద్య రంగం వేల కోట్ల అప్పుల్లో కురుకుపోతోంది. గతంలో ఏపీకి వైద్య పరికరాలు ఇవ్వబోమని, పేరుకున్న బకాయిలను తక్షణమే చెల్లించాలని ‘వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ (ఏఐఎంఈడీ)’రెడ్ నోటీస్ జారీ చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ హాస్పటల్స్ కు మందులు, వైద్య పరికరాలు నిలిపివేస్తున్నట్లు ట్విన్ సిటీస్ హాస్పటల్స్ సప్లయిర్స్ ప్రకటించింది. ఈఎస్ఐ హాస్పటల్స్ సుమాకు రు రూ.200 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు సరఫరా చేశామని, ఆ బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి.. తక్షణమే చెల్లించాలని ప్రకటనలో తెలిపింది. బిల్లుల కోసం సంప్రదిస్తుంటే.. డిమ్స్ డైరక్టర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదని వాపోయింది. తమ సంస్థకు చెల్లిచాల్సిన పెడింగ్ బిల్లులు దాదాపు రూ.200 కోట్లను తక్షణమే చెల్లించాలని, అలా చెల్లిస్తేనే పరికరాలను సరఫరా చేస్తామని కూడా పేర్కొంది. గతంలో ఏఐఎంఈడీ కి బకాయిపడ్డ రూ.800 కోట్లను తక్షణమే చెల్లించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వానికి రెడ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇలా వైద్య రంగం వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోతోంది.
సంప్రదిస్తే స్పందించరు .. అందుకే పరువు తీస్తున్నారు!
ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చుకుని వైద్యరంగంలో కుమ్మరించారు. తప్పదు ప్రజారోగ్యం కోసం ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ వైద్యశాలలకు మందులు,పరికరాలను సరఫరా చేసే కంపెనీలకు కూడా క్రమం తప్పకుండా పెడింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో అవేమి జరగవు. ప్రభుత్వాసుపత్రులకు మందులు, వైద్య పరికరాలు ఎన్ని కంపెనీలు సరఫరా చేస్తున్నాయి? ఆయా సంస్థలకు ఎన్ని వందల కోట్లు బకాయిపడ్డాం అన్న కనీస అవగాహన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్ ( ఏపీఎంఎస్ఐడీసీ ) వద్ద లేకపోవడం శోచనీయం. వందల కోట్లు బకాయిలు పెట్టిన సంస్థలు అనేకమార్లు ఏపీఎంఎస్ఐడీసీ ని సంప్రదించిన స్పందించరు. కనీసం అపాయిట్మెంట్ ఇవ్వకుండా కార్యాలయం చుట్టు తిప్పించుకుంటున్నారు. దీంతో వైద్య పరికరాలు సరఫరా చేసే సంస్థలు రోడ్డెక్కి ఏపీ పరువును తీస్తున్నాయి. రెడ్ నోటీసులు జారీచేస్తాం అని ఏఐఎంఈడీ ప్రకటిస్తే .. శుక్రవారం ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయిర్స్ ఒక ప్రకటన విడుదల చేసి మరి పరువు తీసింది. ఇలా చిల్ల బకాయిలే ప్రభుత్వం సిగ్గుతీస్తున్నాయి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం వైద్యరంగంపై తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి రాష్ట్ర పరువును నిలిపాలని ప్రజలు కోరుతున్నారు.











