కళ్లు తెరచి భవితవ్యాన్ని చూడండి!
1854 నుంచి భారత దేశంలో ఎయిడెడ్ వ్యవస్థ ఉంది. అటువంటి వ్యవస్థను కూలదొయ్యాలని చూస్తే ఎలా అని విద్యార్థి సంఘాలు అక్రోశిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,203 పాఠశాలలు, 182 జూనియర్ కళాశాలలు, 116 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో లక్ష 96 వేల 313 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలల్లో 71,035 మంది విద్యార్థులు, లక్ష 65 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు. కనీస ఫీజులు కట్టుకుని చదువుకోలేని దుస్థితి. ప్రభుత్వం సహరించిన లేకున్న ఫండ్ రేజ్ చేసి సంస్థలను నిర్వహించుకుంటున్నారు ఎయిడెడ్ యాజమాన్యం. అటువంటి తరుణంలో ఎయిడెడ్ కు వెన్నుదండుగా ఉండాల్సిన ప్రభుత్వం అధ్యాపకులను లాగేసుకొని ప్రభుత్వ కళాశాలకు బదిలీ చేసింది. దీంతో ఎయిడెడ్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ చర్యను విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఖండించాయి.
ముర్ఖత్వం వీడకుంటే విద్యార్థుల కోసం ఉద్యమిస్తాం!
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముర్ఖత్వాన్ని వీడకుంటే ఉద్యమిస్తామని అఖిలపక్షం నాయకులు, విద్యార్థి సంఘాల హెచ్చరిస్తున్నాయి. అనంతపురం ఎస్ఎస్బీఎస్ విద్యార్థులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్, సీపీఐ రామకృష్ణాలు డిమాండ్ చేశారు. అనంతపురంలో పర్యటించిన వీరు పోలీసుల దాడిలో గాయపడి విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జీవో నెంబర్ 42 ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలని కూడా చూడకుండా పోలీసులు కొట్టారు, వీధి రౌడీల మాదిరిగా విద్యార్థునుల చొక్కా, మెడ పట్టకుని ఈడ్చుకెళ్లి స్టేషన్లో పడివేశారు. ఇదేక్కడి సంస్కృతి అని లోకేశ్ ప్రశ్నించారు. ఎయిడెడ్ పరిరక్షించకుంటే విద్యార్థుల తరుఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.











