గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద వల్లభనేని వంశీని అరెస్టు చేసే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గన్నవరంలోని వాతావరణం అలాగే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వల్లభనేని వంశీ ఇప్పుడు పత్తా లేకుండా దాక్కున్న సంగతి తెలిసిందే. గన్నవరం ప్రజలు తనకు కూడా దారుణ ఓటమిని రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ఇప్పుడు వల్లభనేని వంశీ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు. పైగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తన ప్రత్యర్థిని ఎదుర్కోలేకపోతున్నారు.
వైసీపీ హాయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నప్పుడు ఏ రకంగా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ ఆఫీసుపై వల్లభనేని వంశీ దా* చేయించారు. నిజానికి టీడీపీ టికెట్ పైననే గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించి.. తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుపైనే కర్కశంగా వ్యవహరించారు. అనరాని మాటలు అన్నారు. ఆ క్రమంలోనే ఓ సందర్భంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి దా* చేయించారు. నానా బీభత్సం చేశారు. టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ఆ వ్యవహారాన్ని కప్పి ఉంచింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ దా* కేసును పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు. విచారణలో పోలీసులు వేగం పెంచారు. టీడీపీ ఆఫీసుపై దా* చేసిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అందులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చి గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ గన్నవరం నియోజకవర్గానికే రాలేదు. గత నెల 7న విజయవాడలోని నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు వెంటపడి మరీ తరిమారు. దా*కి యత్నించారు. దీంతో పోలీసు, కేంద్రబలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాయి. అప్పటి నుంచి వంశీ పత్తా లేకుండా పోయారు. ఎక్కడున్నారనేది కూడా ఏ సమాచారం లేదు.