శేఖర్ కమ్ముల.. కొత్త వారితో కాకుండా.. అగ్ర కథానాయకులతో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. దగ్గుబాటి రానా ను ‘లీడర్’ తో తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే.. అక్కినేనివారి ఫ్యామిలీ హీరో సుమంత్ తో ‘గోదావరి’ తీశారు. ఇక మెగా హీరోతో ‘ఫిదా’ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన , ఇప్పుడు అక్కినేని వారసుడు నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నారు. ఇంత కన్నా ఒక్క అడుగు ముందు కేయలేదు శేఖర్ కమ్ముల.
నిజానికి శేఖర్ తలుచుకుంటే.. ఓ అగ్ర కథానాయకుడ్ని మంచి కథతో పడగొట్టగలరు. కానీ ఆయన దానికెప్పుడూ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కేవలం తన కథలనే నమ్ముకొని దానికి తగ్గ హీరోల్ని ఎంపికచేసుకున్నాడు. అయితే త్వరలోనే ఆయన విక్టరీ వెంకటేశ్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వెంకీకి శేఖర్ ఒక స్టోరీ లైన్ చెప్పాడట. దాన్ని స్ర్కిప్ట్ గా రెడీ చేసి వినిపించమన్నాడట వెంకీ. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఆ పనిలోనే ఉన్నట్టు టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల వెంకీ కథ స్ర్కిప్ట్ రాసే పనిలో ఉన్నాడట.
ఆ మథ్య ఎప్పుడో మహేశ్ బాబు తో శేఖర్ కమ్ముల సినిమా తీయబోతున్నాడని వార్తలొచ్చాయి. శేఖర్ కమ్మల కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు కూడా. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు సడెన్ గా వెంకీ తో సినిమా చేయబోతున్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి వెంకటేశ్ కోసం శేఖర్ ఎలాంటి స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడో చూడాలి.
Must Read ;- ప్రేమకథల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల (బర్త్ డే స్పెషల్)











