విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా ‘దృశ్యం 2’ మలయాళ మూవీ రీమేక్ వెర్షన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒరిజినల్ దర్శకుడు జీతు జోసెఫ్ నే దీనికి దర్శకుడిగా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ అప్టేట్ తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమాను ఏప్రిల్ లో మొదలు పెట్టి.. ఏప్రిల్ లోనే ఫినీష్ చేయబోతున్నారట. జూన్ లో కానీ జూలై లో కానీ సినిమాను విడుదల చేయాలన్నది ఫ్లాన్.
అసలు ఈ సినిమాను ఇంత త్వరగా ఫినీష్ చేసి విడుదల చేసేయడానికి ఒకటే కారణమని తెలుస్తోంది. ఆల్రెడీ చాలా మంది ఓటీటీ లో మలయాళ దృశ్యం 2ను సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూసేశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. అలాంటి ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే .. ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమంతగా ఉండదని నిర్మాతలు ఫీలవుతున్నారట. అందుకే ఏమాత్రం లేటు చేయకుండా.. వీలైనంత త్వరగా.. ఒరిజినల్ వెర్షన్ ను చిత్రీకరించిన లొకేషన్స్ లోనే తెలుగు వెర్షన్ ను ఫినీష్ చేయాలని భావిస్తున్నారట. మరి సురేష్ ప్రొడక్షన్స్ వారి ఈ వ్యూహం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also Read : బాబాయ్ ‘దృశ్యం 2’ లో అబ్బాయ్?











