ఏళ్లుగా ఆ ఊర్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం వీధి దీపాలు కూడా లేవు. విసిగిపోయిన ప్రజలు సాగర్ ఉప ఎన్నికను అవకాశంగా మలుచుకున్నారు. ‘‘మా ఊర్లలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు’’అంటూ ఫ్లెక్సీలు కట్టారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గగ్గినపల్లివారిగూడెం, కమ్మరిగూడెం ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాలు వేంపాడ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నాయి. ప్రధాని రహదారి వెంట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓట్లు అమ్ముకునేది లేదని, గ్రామలకు కనీస వసతులు కల్పిస్తే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామస్తుల కట్టిన ఫ్లెక్సీలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Must Read ;- కాంగ్రెస్ జనగర్జన.. కేసీఆర్ వస్తే తాము చేసినవి చూపుతామన్న జానా