టాలీవుడ్ లో కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. కొనసాగుతున్న ఈ డైరెక్టర్ లాస్టియర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ తో ‘ఎఫ్ 2’ అనే వినోదాత్మకమైన సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమా తెచ్చిపెట్టిన బ్రహ్మాండమైన క్రేజ్ తో.. అనిల్ ప్రస్తుతం ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘ఎఫ్ 2’ సినిమాకు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ చిత్రపరిశ్రమకే గర్వకారణంగా మారింది. అదేంటంటే.. ఈ సినిమా 2019 ఇండియన్ పనోరమ విభాగంలో అవార్డు గెలుచుకుంది. అంతేకాదు ఈ విభాగంలో గౌరవం దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా ఎఫ్ 2 చరిత్ర సృష్టించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాకి స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి .. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించి ‘ఎఫ్ 2’ టీమ్ ను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు.
#F2 #FunAndFrustration : A journey from box-office blockbuster to national recognition 🥳🥳🥳@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisisDSP @SVC_official pic.twitter.com/10zQXWXsI6
— Anil Ravipudi (@AnilRavipudi) October 21, 2020