అందం, అభినయం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది కథానాయికల్లో అనుష్క ఒకరు. టాలీవుడ్ కింగ్ నాగార్జున – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన స్టైలీష్ ఫిల్మ్ సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగుళూరు భామ. తొలి సినిమాతోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత స్టాలిన్ సినిమాలో చిరుతో కలిసి ఓ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్రకారు మనసులు దోచుకుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ లో మరచిపోలేని సినిమా అరుంథతి. ఈ సినిమా అనుష్క దశనే మార్చేసింది.
లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే అనుష్కనే చేయాలి అనేంత గుర్తింపు సాధించింది. బాహుబలి, రుద్రమదేవి, భాగమతి.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షక హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకుంది. కొంతకాలంగా కథానాయిక ప్రాధాన్యం కలిగిన సినిమాలు చేస్త.. విజయాలను అందుకుంటూ వస్తోన్న అనుష్క ఇటీవల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. అయితే.. అనుష్క కొత్త చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అనుష్క, త్వరలో యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఓ విభిన్న ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి రా రా కృష్ణయ్య ఫేం మహేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 25 ఏళ్ల యువకుడికి – 40 ఏళ్ల మహిళకు మధ్య ఆసక్తికరంగా సాగే కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిసింది. అయితే.. ఈ సినిమాలో ఉన్న ఓ కీలక పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీనికి మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి అనే టైటిల్ప రిశీలిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో విజయ్ కీలక పాత్ర పోషిస్తుండడం నిజమేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.











