పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ – పూజా హేగ్డే జంటగా నటిస్తున్నారు. పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత రిలీజైన ‘సాహో’ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ‘రాధేశ్యామ్’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ టీజర్ వస్తుంది అనుకున్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అభిమానులు వెయిటింగ్ కి తగ్గట్టుగా టీజర్ ఉంటుంది. ఖచ్చితంగా టీజర్ అదిరిపోతుంది అంటూ తెలియచేసారు. దీంతో సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ కన్ ఫర్మ్ అనుకున్నారు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా.? రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తారా.? ఎదురు చూశారు.
అయితే.. సంక్రాంతి రావడం.. వెళ్లడం జరిగింది కానీ.. రాధేశ్యామ్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ టీమ్ పై మండిపడుతున్నారు. ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో కూడా అప్ డేట్ ఇవ్వలేదు. ఇలా అభిమానులను నిరాశపరచడంతో ఈ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరి.. రాధేశ్యామ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో.? అభిమానుల ఎదురు చూపులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.











