వేణుంబాక విజయసాయిరెడ్డి… ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. వైైసీపీలో ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటులో వైసీపీ పార్టీ నేతగా కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ ఆడిటర్. అదేంటీ… ఇన్ని పదవులు వెలగబెడుతున్న సాయిరెడ్డిని సీనియర్ ోస్ట్ నేత అనకుండా… ఆడిటర్ అంటారేమిటీ? అని నిలదీస్తారా?.రాజకీయ నేత కంటే కూడా ఆడిటర్ గానే సాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఆడిటర్ గా తన అతి తెలివితేటలని వినియోగించి…జగన్ లాంటి రాజకీయ నేతలు అందినకాడికి దండుకుంటూ ఉంటే… ఆ సొమ్ము ప్రభుత్వానికి పట్టుబడకుండా కాపలా కాశారు. ఈ కారణంగానే ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడిాగా మారారు. అంతేనా… ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్ తో పాటే కలిసి సాగారు. జగన్ తో పాటే జైలు జీవితాన్నీ గడిపారు. రాజకీయ నేతగా పెద్దగా రాణించలేకపోయినా.. తన సీఏ విద్యాబుద్దులతో జగన్ కు వేల కోట్ల సామ్రాజ్యాన్ని మాత్రం పకడ్బందీగానే నిర్మించారు. అందుకే.. సాయిరెడ్డిని పొలిటీషియన్ అనే కంటే కూడా ఆడిటర్ అంటేనే సరిపోతుంది.
ఆర్థిక పరమైన అక్రమాలు ఎలా చేయాలి? అవి ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ దర్యాప్తు సంస్థలు వాటిని పట్టేస్తే… ఎలాంటి ఆన్సర్లు ఇచ్చి తప్పించుకోవాలి? విచారణలో ఎలాంటి పిల్లిొమగ్గలు వేయాలి?… ఇలాంటి వాటిపై సాయిరెడ్డికి ఉన్నంత పట్టు మరొకరికి లేవంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే…జగన్ సోదరుడు వైవీ విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డిలు కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ లను ఏ రీతిన తన నుంచి లాక్కున్నారో వివరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త కేవీ రావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టిందే సాయిరెడ్డి అని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేయగా…దాని ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. సీఐడీ కంటే కాస్త వేగంగా కదిలిన ఈడీ…సాయిరెడ్డిని సోమవారం విచారించింది. 6 గంటలకు పైగా సాగిన ఈ విచారణలో ఈడీ అధికారులకు సాయిరెడ్డి చుక్కలు చూపించారని సమాచారం.
దాదాపుగా ఈడీ అధికారులు 25 ప్రశ్నలు సంధిస్తే… వాటిలో మెజారిటీ ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు… అంటూ దాటవేత సమాధానాలనే సాయిరెడ్డి చెప్పారట. అంతేకాకుండా కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలతో తన సంబంధాలపైనా ఆయన తనదైన శైలి ఆన్సర్లు ఇచ్చారట. విక్రాంత్ రెడ్డి తనకు వైైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలుసునని, ఇక శరత్ చంద్రారెడ్డితో బంధుత్వమే ఉందన్న సాయిరెడ్డి… వారిద్దరిితో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తెలిపారట. ఇక ఈ కేసులో బాధితుడిగా ఉన్న కేవీ రావు ఎవరో తనకు తెలియదని చెప్పారట. కేవీ రావుకు తానెప్పుడూ ఫోన్ చేయలేదని, కావాలంటే కాల్ డేటాను పరిశీలించుకోవాలని కూడా ఆయన ఈడీ ఆపీసర్స్ కు చెప్పారట.
జగన్ తొలి కంపెనీ సండూర్ పవర్ గురించి ప్రశ్నిస్తే.. 22 ఏళ్ల క్రితం నాటి అంశాలు ఎలా గుర్తుంటాయని ఈడీ అధికారులకే ఎదురు ప్రశ్నలు సంధించారట. ఓ సారి అవకాశం ఇస్తే… రికార్డులు చదువుకుని.. మరోమారు విచారణకు పిలిస్తే చెబుతానంటూ తనకు మాత్రమే సాధ్యమైన విచిత్ర ఆన్సర్ ఇచ్చారట. అసలే అక్రమ సంపాదనలో కాకలు తీరిన సాయిరెడ్డి అంత ఈజీగా దొరుకుతారని ఈడీ అధికారులూ భావించి ఉండరులే గానీ… విచారణలో తన ఆడిటర్ బుద్ధిని ఆయన ప్రదర్శించుకున్నతీరు చర్చనీయాంశంగా మారింది.