టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ మంత్రి హోదాలో ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో లోకేశ్ ఓ కీలక భేటీలో ఉండగా… బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ నుంచి ఆయనకు సోషల్ మీమడియాలో ఓ సందేశం వచ్చింది.ఈ సందేశాన్ని చూసినంతనే లోకేశ్ అంత బిజీలోనూ స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నఅవకాశాల సంగతి ఏమో గానీ.. కూటమి సర్కారు వచ్చాక ఏపీపై కాస్తంత నమ్మకం అయితే కలుగుతోందని, ఈ నమ్మకం మరింతగా పెరిగితే తప్పించి… ఏపీకి పెట్టుబడులు వచ్చేలా లేవని కూడా పాయ్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయని, అందుకు డబ్బులతో రెడీగా ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా చాలా మందే ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ బృహత్కార్యానికి ఒకే ఒక్క విషయం అడ్డంకిగా నిలుస్తోంది. ఆ అంశమే జగన్.
నిజమే.. జగన్ పేరు వింటేనే ఇండస్ట్రియలిస్ట్ లు హడలిపోతున్నారు. గత టీడీపీ హయాంలో విశాఖలో భారీ షాపింగ్ మాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చిన లులూ కంపెనీ… జగన్ సీఎం కాగానే ఏపీ నుంచి దాదాపుగా పరుగులు పెడుతూ పరారైపోయింది. ఇక అప్పటికే తన కార్యకటాపాలు ప్రారంభించిన కియా పరిశ్రమకు చెందిన యాజమాన్యాన్ని జగన్ అండ్ కో ఏ రీతిన ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము అడిగినంత మేర లంచాలు ఇస్తేనే… ఏపీలోకి రానిస్తామన్న రీతిలో బహిరంగంగానే బేరసారాలకు దిగిన జగన్ సర్కారు తీరుతో నిజంగానే వైసీపీ పాలనఅంటేనే… పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించి నూతన పాలనను చేపట్టిన సంగతి తెలిసిందే. అయినా కూడా పారిశ్రామికవేత్తల్లోని భయం పోలేదు. ఆయా భేటీల సందర్భంగా జరుగుతున్న చర్చల్లో పారిశ్రామికవేత్తలు చెబుతున్న అంశాలే ఇందుకు నిాదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆదివారం విశాఖ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్… త్వరలో జరగనున్న ప్రదాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి పెట్టుబడులను రాబట్టేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని చెప్పిన లోకేశ్… ఎక్కడికి వెళ్లినా ఆయా పారిశ్రామిక దిగ్గజాల నుంచి ఒకే ప్రశ్న ఎదురవుతోందని తెలిపారు. మరోమారు ఏపీకి జగన్ సీఎం కారంటూ హామీ ఇవ్వగలరా? అంటూ పారిశ్రామికవేత్తలు తమను అడుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కొందరైతే… జగన్ మళ్లీ సీఎం కారని ఏకంగా హామీ పత్రమే రాసివ్వాలని అడుగుతున్నారట.
ఇలాంటి ప్రశ్నలకు ఎలా స్పందించాలో కూడా తమకు అర్థం కావడం లేదని కూడా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో నుంచి దిగిపోయినా కూడా రాష్ట్రాన్ని జగన్ పీడ వదిలిపోలేదని చెప్పడానికి ఇది ఓ నిదర్శనమని ఆయన అన్నారు. అంతేకాకుండా గడచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఏ తరహా పాలన సాగించారన్నదానికి కూడా ఇది నిదర్శనని లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా… రాష్ట్రాభివృద్ధి దిశగా ఓ బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.