రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘లైగర్’ . ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ వారు బాలీవుడ్ లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ బాలీవుడ్ డెబ్యూ ఈ మూవీతోనే జరగనుండడం విశేషంగా మారింది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే రివెజ్ స్టోరీగా లైగర్ తెరకెక్కుతుండగా.. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండగా.. విజయ్ తల్లిగా సీనియర్ నటీమణి రమ్యకృష్ణ అభినయిస్తోంది.
ఇక లైగర్ సినిమాను సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలోనూ .. వివిధ విదేశీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్థుత పరిస్థితుల్లో విడుదల ఆ డేట్లో సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ ను ఈ రోజే విడుదల చేయాలి లెక్క ప్రకారం. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ప్రస్తుతం అందరికీ పరీక్షా సమయం. ఈ పరిస్థితుల్లో అందరూ ఇంటి వద్దనే క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించే వారిని రక్షించే బాధ్య మీద భుజాల పైనే ఉంది. నిజానికి లైగర్ సినిమా టీజర్ ను మే 9న విడుదల చేయాలని అనుకున్నాం. విజయ్ పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ ను టీజర్ తో రివీల్ చేయాలనుకున్నాం. అయితే దేశం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తున్న ఈ పరిస్థితుల్లో మా ప్రయత్నాన్ని విరమించుకున్నాం. మరో మంచి సమయం చూసి టీజర్ ను విడుదల చేస్తాం. అంతవరకూ మీరంతా ఇంటివద్దనే క్షేమంగా ఉండండి. తప్పకుండా వేక్సిన్ తీసుకోండి.. అంటూ ధర్మ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు.
In light of the current environment & country's testing times, we must solely help our community!
So, Team decided to postpone #LIGER Teaser.#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/Vrx7cm7aOT— BARaju (@baraju_SuperHit) May 9, 2021