నేటికి ప్రపంచం కరోనా కబంద హస్తాలలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యాధి ప్రబలడానికి సిద్ధంగా ఉందని ఒక వైద్య శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. వారు ఎవరో కాదు.. ఎబోలా వైరస్‌ను కనుగొన్న డాక్టర్ కావడం విశేషం. ‘X’ అనే వ్యాధి ప్రపంచాన్ని కబలించడానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్తరకం వైరస్ కూడా కొవిడ్ లాగా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని.. ఎబోలా కంటే ప్రమాదకరమైనది అని చెప్తున్నారు. కొవిడ్-19 తగ్గుతుందని మానవాళి ఎంతో కొంత సంతోషిస్తున్న ఈ సమయంలో ఇలాంటి వార్త మళ్లీ గుబులుపుట్టిస్తుంది. ‘X’ వ్యాధి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో వ్యాధులు ప్రకృతి పరంగా ప్రబలే అవకాశం ఉందని ఎబోలాను 1976లో కనిపెట్టిన వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

జంతువులు.. మనుషులు..
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మాత్రమే కాదు గతంలో ఎన్నో జబ్బులు.. జంతువుల నుండి మనుషులకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎల్లో ఫీవర్, ఫ్లు, రాబిస్, కొవిడ్.. ఇలాంటి వన్నీ జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందిన వ్యాధులు కావడం గమనార్హం. ఇలా జంతువుల నుండి మనుషులకు సంక్రమించిన వ్యాధులు తర్వాతి కాలంలో మానవాళిని అతలాకుతలం చేసిన దాఖలాలు ఎక్కువ. అందుకు ప్రత్యక్ష సాక్షమే కరోనా. ఇంక భవిషత్తులో రాబోయే వ్యాధులు కరోనా మించి ఉండబోతున్నాయని.. వాటిని ఎదుర్కొనడానికి మానవాళి సిద్దంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆఫ్రికాలో నమోదైన మొదటి ‘X’ కేసు..
వైద్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఒక అంతుపట్టిని వ్యాధి కేసు నమోదైన నేపథ్యంలో ఎబోలా టెస్టులు చేయగా.. అది ఎబోలా వైరస్‌ని పోలి ఉండడంతోపాటు.. అంతకంటే ప్రమాదకరంగా ఉందని తెలిసింది. అంతేకాదు కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న లక్షణాలు కలిగి ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు. కానీ ఎబోలా టెస్ట్ లో నెగిటివ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయమని వైద్యులు అంటున్నారు. ఇలా టెస్ట్ లకు తెలియకపోతే దాన్ని కనిపెట్టడం చాలా ప్రమాదకరమని.. అసలు వ్యాధి సోకిందా లేదా అని కనిపెట్టలేకపోతే.. చికిత్స చేయడం ఎలా సాధ్యమవుతుందని శాస్త్రవేత్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు.. టామ్ ఫమ్ అనే వ్యాధి కూడా ఆఫ్రికా అడవుల నుండి వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి వైద్యులు చెప్తున్నారు.











