డ్రగ్స్ రాకెట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రుల పాత్ర ఏమిటో అంతుబట్టడం లేదు. ఇందులో ఎవరైనా వేలు పెడితే అందులో కాలు పెట్టినట్టే అవుతుంది. ఇంతకీ ఆ వేలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు సంచలన విషయమై కూర్చుంది. ఇది బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కాదు శాండల్ వుడ్ కు చెందింది. బాలీవుడ్ లో మొదలైన ఈ కేసు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ అనుశ్రీ పాత్ర కూడా ఉందని వార్తలు రావడంతో ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసి తనకు ఏ పాపమూ తెలియదని వాపోయింది. తనను అధికారులు విచారించినంత మాత్రాన తనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే ఇది మాజీ ముఖ్యమంత్రు పాత్రపై అనుమానాలకు ఆస్కారం కలిగింది. దీనికి కారణం సాక్షాత్తూ ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన ఆరోపణలు. అనుశ్రీకి ఓ మాజీ ముఖ్యమంత్రి ‘నీకేం కాదు నేనున్నానంటూ’ అభయహస్తం ఇచ్చారని కుమారస్వామి ఆరోపించారు.
ఆ మాజీ ముఖ్యమంత్రి అనుశ్రీకి ఫోన్ చేసినట్లు తన దగ్గర సమాచారం ఉందని కుమారస్వామి అన్నారు. ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం ఆయన పేరును బయటపెట్టలేదు. మరో విషయం ఏమిటంటే అనుశ్రీ విడుదల చేసిన వీడియోపై ప్రశాంత్ అనే ఓ సామాజిక కార్యకర్త కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆమెను ఓ గాడ్ ఫాదర్ రక్షిస్తున్నారని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆరోపణలే చేయడంతో ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? అసలు అనుశ్రీతో ఆయనకు ఉన్న సంబంధ ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులో అనుశ్రీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకీ ఆ మాజీ ఎవరు?
కుమార స్వామి పేర్కొన్న ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతను అధికార పార్టీకి చెందినవాడా, ప్రతిపక్షం నేతా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఆరోపణలు చేసింది కుమారస్వామి కాబట్టి ఆయనను మినహాయిస్తే ప్రధానంగా అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తెరపైకి వచ్చాయి. జగదీష్ షెట్టార్, డి.వి. సదానంద్, వీరప్పన్ మొయిలీ, ఎస్.ఎం. కృష్ణ, సిద్ధరామయ్యలలో అనుశ్రీకి ఫోన్ చేసింది ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆ మాజీ ముఖ్యమంత్రి నీకేం కాదని భరోసా ఇచ్చాడంటే అతను అధికార పార్టీకి చెందిన వాడై ఉండొచ్చన్న ఊహాగానాలూ ఉన్నాయి. కేవలం సినిమా రంగానికే పరిమితమనుకున్న ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపుల వైపు మళ్లుతోంది.
సంజన, రాగిణి ఫోన్లలో బూతుపురాణం
ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నటులు రాగిణి ద్వివేది, సంజనా గర్లానీలపై మరికొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీరి ఫోన్లలో బ్లూ ఫిలిమ్స్, న్యూడ్ ఫొటోలు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. వీరింతా వాట్స్ ప్ గ్రూప్ ను కూడా మెయింటెయిన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాగిణి, సంజన విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో ఛాటింగ్ చేసినట్లు అధికారుల దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో వీరు తరచూ పార్టీలు చేసుకుంటుంటారని అంటున్నారు. ఈ ఇద్దరు నటులతో సంబంధాలున్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కెంగేరి, నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ముంబయి, గోవాల నుంచి డ్రగ్స్ తెచ్చి మంగుళూరులో అమ్ముతున్నట్లు తేలింది. డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేశారు.
https://www.instagram.com/tv/CF0503kHBr2/?utm_source=ig_web_copy_link











