మెగా కుటుంబంలో అన్నదమ్ములిద్దరిదీ ఒకే మాట ఒకే బాటగా ఉండేటట్లు ఉంది. తాజా పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి జనసేన పార్టీని బలోపేతం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీని తన అన్న మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసిన మెగాస్టార్ జనసేన కోసం ఓ మూవీ చేసి దాని ద్వారా వచ్చే లాభాల్ని తమ్ముడికి ఇవ్వబోతున్నారని సమాచారం.
వివారాల్లోకి వెళితే ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ మెహర్ రమేశ్ తో సినిమా చేయడానికి చిరంజీవి ఒప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. పీకే కి అత్యంత సన్నిహితంగా మెలిగే అశోక్ అనే బిగ్ షాట్ కి మెహర్ రమేశ్ బాగా పరిచయం. రామ్ ద్వారా మెహర్ పీకేకి దగ్గరైన తరువాత, పీకే మెహర్ ని చిరుకి ఇంట్రడ్యూస్ చేశాడు, అయితే కరోనా క్రైసిస్ ఫండ్ ని రైజ్ చేయడంతో మెహర్ పై చిరు దృష్టి పడింది. దీంతో లూసిఫర్ రీమేక్ చేసే బాధ్యత మెహర్ కి అప్పచెప్పాడు చిరు.
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నప్పటికీ పీకే కూడా ఇందులో నిర్మాణ భాగస్వామిగా వ్యవహించబోతున్నారని టాక్. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేని మెహర్ దశ ఈ దెబ్బతో అయినా మారుతుందేమో చూడాలి. ఇదంతా చూస్తుంటే అన్నదమ్ములంతా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నట్టే ఉంది. ముందు సినిమాలు, ఆ తర్వాత రాజకీయం… ఇదే ఈ అన్నదమ్ముల వ్యూహం అని అనుకోవచ్చు. ఈ మెగా పవర్ ఎంత బలంగా తయారవుతుందో చూడాలి.











