పోసాని కరిష్మా మురళి .. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో తెలీదు ..అవసరాన్ని బట్టి వైసీపీ ఆయన్ని రంగంలోకి దింపుతోంది .. గత కొన్నేళ్లుగా వైసీపీకి అవసరమైనప్పుడు మీడియా ముందుకు రావడం … టీడీపీని , చంద్రబాబుని లోకేష్ ని తిట్టడం .. తర్వాత సైలెంట్ అవడం ఇదే అయన పని ..ఈ మధ్య పవన్ పై కూడా అయన విమర్శలు చేస్తున్నాడు .. ఆయన తిట్ల దండకానికి మెచ్చిన జగన్.. ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చారు .అప్పటి నుంచి కాస్త ఎక్కువగానే స్వామి భక్తిని చాటుకుంటూ .. టీడీపీ , జనసేన అధినేతలపై విరుచుకుపడుతున్నాడు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఏపీలో వాలంటీర్లు కొందరు ఉమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు .. అయితే అది వాస్తవమే .. కొందరు వాలంటీర్లు అలాంటి పనులు చేస్తూ .. అడ్డంగా దొరికి కటకటాల వెనక్కు కూడా వెళ్లారు .. తాజగా కూడా అలాంటి ఘటన జరిగింది .. వాటిపై పవన్ స్పందించడమే వైసీపీ నేతలకి ఇబ్బందిగా మారింది ..అందుకే పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు .. వైసీపీ కీలక నేతలు సరిపోలేదేమో .. ఆ పార్టీకి బాకా ఊదే .. పోసాని కూడా రంగంలోకి దిగారు .. అసలు నీకు ట్రాఫికింగ్ అంటే ఏంటో తెలుసా.. అంటూ ప్రశ్నించారు. ఎప్పటిలాగే నారా లోకేష్ ని ఇందులోకి లాగాడు … ట్రాఫికింగ్ అంటే ఇది అంటూ ఆయన చెప్పుకొచ్చారు..అంతేకాదు జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే ఆశయంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు మరో లక్ష్యం లేదు అంటూ వ్యాఖ్యానించారు. వలంటీర్ల గురించి పవన్ మాట్లాడడం కంటే దిగజారుడు మరొకటి లేదంటూ కూడా పోసాని విమర్శించారు.. వాస్తవానికి పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదు .. కొందరు వాలంటీర్లు చేసిన బాగోతాలు వైసీపీ నేతలకు తెలుసు .. అయితే ప్రత్యర్థుల ఓట్లని తీసేస్తూ .. గ్రామా స్థాయిలో వైసీపీ కి అనుకూలంగా పనిచేస్తూ .. పధకాలు ఆగిపోతాయని బెదిరిస్తూ .. వైసీపీ కోసం పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ గురి పెట్టడంతో .. ఒక్కసారిగా వారిలో ఆందోళన మొదలయింది .అందుకే ఇదే పెద్ద సమస్యగా వైసీపీ దీనిపై పోరాటం చేస్తుంది ..పోసాని లాంటి వారు వంత పాడుతున్నారు
వాస్తవానికి ఒకానొక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న పోసాని. ఇప్పుడు రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ తో విభేదాలు ఉన్నట్టుగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయారో తనకు తెలుసు అని. సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధ పడరా అని ప్రశ్నించారు. వాలంటీర్లలో ఆడవాళ్లు ఉంటారు. ఆడవాళ్లపై అగౌరవంగా మాట్లాడటం పవన్ కు తగదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గొప్పదని పోసాని పొగిడారు .. అయితే వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధ పడరా అన్న పోసానికి వైసీపీ నేతల బూతులు వినబడవా ..వాళ్ళ బాగోతాలు కనపడవా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి /.వాస్తవానికి బూతులకి పేటెంట్ తమదే అన్నట్టు వైసీపీ నేతలు రెచ్చిపోతారు ..ఒకరికి మించి ఒకరు పోటీ పడి బూతులు తిడతారు .. రాజకీయాలకి సంబంధం లేని వారిని ..కుటుంబ సబ్యులని కూడా అవమానించిన చరిత్ర వైసీపీ నేతలది ..అలాంటి వారి బాగోతాలు చూడని పోసాని .. పవన్ ని ,టీడీపీ నేతలని విమర్శించడం అయన విజ్ఞతకే వదిలేస్తున్నారు .
ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!
చంద్రబాబు అరెస్టు..! ఆంధ్రా..తెలంగాణా..కర్నాటక..తమిళనాడు బరస్డు..! ఐటీ ఉద్యోగుల నిరసన..మగువల తెగువ..! యన్ ఆర్...