ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం మకాం మార్చేందుకు తేదీని ఖరారు చేసుకున్నారు. అక్టోబరులో తీర ప్రాంతమైన సాగర నగరం శిష్ట కానుందని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యుద్ధభేరి కార్యక్రమంలో సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ విశాఖ వెళితే టీడీపీకి ప్లస్ అవుతుందని.. అక్కడ టీడీపీ మెజారిటీ మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు..
ఈ ప్రభుత్వంలో ప్రజల భూములకు రక్షణ లేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని.. దీనికి సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? రాష్ట్రంలో ఓట్ల దొంగలు ఉన్నారని.. ఓటు వేయరని తెలిస్తే ఓటును తొలగిస్తారన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అతను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. వారు మంచి పని చేస్తే, అతను వారిని అభినందిస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. మహాశక్తి పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందనున్నారు.
కాగా, అంబటిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల కంటే బ్రో సినిమా కలెక్షన్ల విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఎత్తిచూపుతున్నారు. ప్రాజెక్టుల గురించి మంత్రిని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుంటే మీడియా ముందు బ్రో అంటూ ఉతికి ఆరేసారు.
అయితే ప్రోజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు అడుగుతున్న ప్రశ్నలకి వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గాని ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు.. చంద్రబాబు అడుగుతున్న ప్రోజెక్టుల ప్రోగ్రెస్ గురించి చెప్పడానికి చేతకాని మంత్రి అంబటి రాంబాబు, టాపిక్ ని డైవర్ట్ చేసి బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాడని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేసాడు. చంద్రబాబు నాయుడు అడుగుతున్న ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేక వైసీపీ ప్రభుత్వం తోక ముడుచుకొని కూర్చుంది. చంద్రబాబు నాయుడు వైసీపీని ఎండగడుతున్నా, ఆయన అడుగుతున్న వాటికీ సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు మొఖం చాటేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకుంటే వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చంద్రబాబు దెబ్బకి జగన్ ప్రభుత్వం వైజాగ్ కి పారిపోతోంది అని తెలుస్తోంది.