పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రతి పక్షాలు కనీసం నామినేషన్లు వేయకుండా భయపెట్టారు, ఉపసంహరించుకోవాలని ఎన్ని విధాలుగా బెదిరించాలో అన్నీ చేశారు. చివరకు లెక్కింపు సమయంలో కరెంటు కట్ చేయడాలు, తప్పుడు లెక్కిలు చూపించి గెలుపు నమోదు చేసుకోవడం లాంటివి చేశారు.
ఇక పంచాయతీ ముగిసిపోయిందిలే.. ఇక అంతా మామూలే అనుకుంటున్న సమయంలో.. కొత్తగా ఓట్లు వేయలేదని కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నరసారావు పేటలోని గోగులపాడు పంచాయతీతో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియో హల్ చల్ చేస్తున్నాయి.
నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, గోగులపాడు పంచాయతీ 5వ వార్డులో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్ధి వార్డు మెంబర్ గా గెలుపొందారు. దీన్ని అవమానంగా భావించిన అధికార పార్టీ నాయకులు.. వైసీపీ బలపరచిన అభ్యర్థికి ఓటెయ్యని ప్రజలపై పగబట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు మేరకు ఇస్సాపాలెం పరిధిలో పంచాయితీ సెక్రెటరీ మరియు పోలీస్ అధికారులు దగ్గరుండి గృహాల ముందు భాగం డ్రైనేజీ, మెట్లు,రాంప్ ను కలసి అక్రమంగా కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి ఇంటిముందు భాగాన్ని కూల్చివేశారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి అన్యాయాలకు పాల్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- సర్పంచ్ ఎవరైనా.. అధికారం నాదే..!