ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా..! అన్నట్లుంది రాష్ట్రంలో వైసీపీ నేతల తీరు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానంలో తమ నాయకుడు జగన్ తోనే పోటీపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఎవరికి వారుగా ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నారు. తాజాగా ఇలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ఏ పార్టీ వాళ్లు సర్పంచ్ అయినా పరిపాలనంతా తన చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
పంచాయతీలకు తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతోపాటు అధికారులంతా తన కంట్రోల్లోనే ఉంటారని, ఉద్యోగాలు తీయాలన్నా వేయాలన్నా తానే చేయాలని అనడంతో వారంతా అవాక్కయ్యారు. ప్రజలు గెలిపించిన తమపై ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.
Must Read ;- కోస్తా జిల్లాల్లో సత్తా చాటిన టీడీపీ.. వైసీపీ నేతల్లో కలవరం