అదేంటో గానీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసబెట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎస్నికల్లో తాను నమ్మిన ప్రజలు తనకు గట్టి గుణపాఠంచ చెప్పగా… అప్పటిదాకా 151 మంది ఎమ్మెల్యేలతో యమా స్ట్రాంగ్ గా ఉన్న జగన్… ఒక్కసారిగా 11 మంది ఎమ్మెల్యేలకు పడిపోయారు. ఫలితంగా అప్పటిదాకా అనుభవిస్తున్న సీఎం పదవి ఆయనకు దూరమైంది. ఆ పదవి ద్వారా అనుభవిస్తున్న డాబూ దర్పాలు దూరమయ్యాయి. వంగి వంగి దండాలు పెట్టే అధికారులు ఆయన వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక తాను అధికారంలో ఉండగా… చేసిన దుర్మార్గాలపై ఒక్కటొక్కటిగానే కేసులు నమోదై పోతున్నాయి. ఫలితంగా తనకు పెట్టని కోలా వ్యవహరించిన నేతలంతా కేసుల భయంతో వణికిపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వారు సాహసించడం లేదు. అంతేనా…అప్పటిదాకా తన కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ అంటూ తన నోటితో పొగిడిన నేతల్లో చాలా మంది ఇప్పటికే పార్టీ మారిపోయారు. మరికొందరు ఆ దిధశగా పయనిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం జగన్ కు అన్నీ ప్రతికూలంగానే జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తనతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆయనకు భారీ షాకిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితంగా జగన్ తో పాటు 10 మంది… మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కే పరిస్థితి లేదు. అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ పార్టీ సభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లభిస్తుంది. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆయా పార్టీలు కనీసం 18 సీట్లను కలిగి ఉండాలి. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి ఆ హోదా దక్కలేదు.అయితే తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ చిన్న పిల్లాడి మాదిరిగా మారాం చేస్తున్న జగన్… బడ్జెట్ సమావేశాలను బహిష్కరించారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కారని ఆయన ప్రకటించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, లేదంటే మీడియాతో మాట్లాడుతూ అధికార పక్షాన్ని ఎండగడతామని ప్రకటించారు.
ఈ లెక్కన బుధవారం నాటి సమావేశాల సంధర్భంగా జగన్ పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ జరుగుతుందని, అది ఎలా ఉంటుందో చూద్దామని చాలా మంది ఉబలాటపడ్డారు. అయితే జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డి నేతృత్వంలోని సాక్షి టీవీలో గానీ… వైసీపీకి అనుకూలంగా ఎన్న ఛానెళ్లలో గానీ ఈ మాక్ అసెంబ్లీ ప్రసారం కాలేదు. దీంతో చాలాసేపు వేచి చూసిన కొందరు.. అసలు ఏం జరిగింతదని ఆరా తీయగా… మాక్ అసెంబ్లీకి జగన్ అందుబాటులోనే ఉన్నారని, అయితే ఆ మాక్ అసెంబ్లీకి హాజరుకావాల్సిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తాడేపల్లి ప్యాలెస్ కు రాలేదని తేలింది. ఈ లెక్కన వీరంతా తమ పార్టీ అదినేత జగన్ ఆదేశాలనే ధిక్కరించారన్న మాట. అసలే ప్రథాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేక చతికిలబడితే..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అవసరమా? అంటూ వారంతా జగన్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారట.ఈ కారణంగానే అసెంబ్లీనే వద్దనుకున్నప్పుడు… ఇక అసెంబ్లీ సమావేశాలను అునుకరిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహణ అవసరమా? అన్నదిశగా ఆలోచించిన వారంతా… అదేమీ అవసరం లేదులే అన్న దిశగా ఓ మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారట. అనుకున్నదే తడవుగా 10 ఎమ్మెల్యేలు మూకుమ్మడిగానే మాక్ అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారట.
ఒకరో,ఇద్దరో ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీకి రాకపోతే…వారిని దండించవచ్చు…మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలే మాక్ అసెంబ్లీకి రాకపోతే ఇక ఎవరిని దండించేది? అని మదనపడిపోయిన జగన్… చెప్పాపెట్టకుండానే మాక్ అసెంబ్లీని రద్దు చేసుకున్నారు. ఇక కనీసం మీడియా ముందుకైనా రాకపోతే బాగుండదని అనుకునక్నారో. ఏమో తెలియదు గానీ…చాలా ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చిన జగన్ మొన్నటి బడ్జెట్ అంశాలను తీరిగ్గా బుధవారం ప్రస్తావిస్తూ సాగారు. అదే సమయంలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లుగా వరుసబెట్టి వచ్చిన ప్రకటనలపైనా జగన్ తనదైనశైలిలో స్పందించారు. ఇటు టీసీఎస్ అయినా, అటు రిలయన్స్ అయినా, మరోవైపు మిట్టల్ స్టీల్ అయినా కూడా తన హయాంలో ఆయా కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పిన జగన్… తన కష్టాన్ని టీడీపీ నేతలు… ప్రత్యేకించి మంత్రి నారా లోకేశ్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు.