ఆంధ్ర ప్రదేశ్ లో పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది.ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన ఏపీలో కలకలం రేపగా.అనేక విమర్శల అనంతరం పోలీసులు అనంతబాబు ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం అనంత బాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఈ ఘటనపై దళిత సంఘాలతో పాటు విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయగా….ప్రస్తుతం అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉంటున్నారు.కాగా, గతంలో అనంత బాబుకు కోర్టు విధించిన జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.
ఈ సందర్భంగా అనంతబాబు రిమాండ్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో తిరిగి అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు.ఇదిలా ఉంటే గతంలో అనంతబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సైతం రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తోసిపుచ్చింది.సరైన కారణాలు చూపకపోవడంతో పాటు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంశాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.