చాలా ఏళ్ల తర్వాత కడప కోటపై టీడీపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని నమోదు చేసింది. వైసీపీకి గట్టి పట్టున్న కడప జిల్లాలో మెజారిటీ సీట్లను గెలిచిన టీడీపీ…కడప ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకుని సత్తా చాటింది. జగన్ కు అపజయం అంటే ఎలా ఉంటుందో పరిచయం చేసింది. కడప ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవి అయితే… జిల్లా నుంచి వైసీపీని తరిమికొట్టేదాకా విశ్రమించేది లేదన్న రీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాధవి దూకుడు చూసిన టీడీపీ శ్రేణులు తమకు సరైన అండ దొరికిందన్న భావనతో ఫుల్ యాక్టివేట్ అయిపోయారు.
గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కడప జిల్లాలో టీడీపీని ఇతరులకు తలొగ్గని రీతిలో బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ దిశగా మాధవి రచిస్తున్న వ్యూహాలతో కడప కార్పోరేషన్ లో పాలక పక్షంగా ఉన్న వైసీపీ బెంబేలెత్తిపోతోంది. ఇటీవల కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్ గా తీసుకున్న మాధవి… ఎలాగైనా కడప కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని లాగేసుకోావలన్న కసితో సాగుతున్నారు.
గత వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల మాదిరిగానే కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీ వశమైంది. ఆ పార్టీ నేత సురేశ్ బాబు ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కార్పొరేషన్ లో మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీ వారే. టీడీపీకి పెద్దగా బలమేమీ లేదు. కార్పొరేషన్ లో మొత్తం 50 సీట్లు ఉంటే… వాటిలో 48 స్థానాలను వైసీపీ దక్కించుకోగా… టీడీపీ, జనసేనలు చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఫలితంగా మొన్నటిదాకా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాల్లో టీడీపీ వాయిస్ అసలు వినిపించేదే కాదు.
ఇప్పుడు పరిస్థితి మారింది. స్థానిక ఎమ్మెల్యే మాధవి రూపంలో ఇప్పుడు కడప కార్పొరేషన్ లోె టీడీపీ స్వరం గట్టగానే వినిపిస్తోంది. మహిళా నేతలను గౌరవించలేని నేతలు కార్పొరేషన్ చైర్మన్లగా కొనసాగినంత కాలం నగరం అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలుస్తుందంటూ సెటైరిక్ డైలాగులు సంధిస్తున్న మాధవి… చైర్మన్ పీఠం నుంచి సురేశ్ బాబును దించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఓ మోస్తరు పురోగతిని మాధవి సాధిాంచినట్లుగా సమాచారం.
వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లను టీడీపీలోకి లాగేసే దిశగా మాధవి వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి స్థానాలు వారికే ఇచ్చే విధంగా తొలి వ్యూహాన్ని అమలు చేసిన మాధవి మంచి ఫలితాన్నే సాధించినట్లుగా తెలుస్తోంది. అదే సయంలో టీడీపీ అధికారంలో ఉన్నందున భవిష్యత్తులో రాజకీయంగా మరింత మేర ప్రాధాన్యం ఇస్తామన్న రెండో వ్యూహాన్ని బయటక తీసిన మాధవి… వరుసగా రెండు వ్యూాహాలతో ఏకంగా 20 మంది దాకా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ వైపునకు లాగేశారట.
ప్రస్తుతానికి వారంతా ఇంకా వైసీపీలోనే ఉన్నా… తాను అనకున్న నెంబర్ టచ్ అయిన మరుక్షణమే కార్పొరేటర్ల వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కడప కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు కనీసం 26 మంది కార్పొరేటర్లు కావాలి. ప్రస్తుతం టీడీపీ కూటమికి రెండు సీట్టు ఉండగా…ఇంకో 24 సీట్టు కావాల్సి ఉంది. ఇప్పటికే 20 మందిని లాగేసిన మాధవి అతి త్వరలోనే మరో నలుగురు. ఐదుగురిని లాగేయడం ఖాయమే. ఇదే జరిగితే.. కడప నగర పాలక సంస్థపై వైసీపీ జెండా కింద పడిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.