టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో సానుభూతి రావడంతో లోకేష్ విషయంలో వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో అంతటా తీవ్ర విమర్శలు.., ప్రజా వ్యతిరేకతను జగన్ ప్రభుత్వం మూటగట్టుకుంది. అనూహ్యంగా టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం జగన్ రెడ్డి బ్యాచ్‌కు మింగుడుపడటం లేదు. తెలుగుదేశం పార్టీ కేడర్ కనుమరుగైపోయిందని, ఒకరిద్దరు లీడర్లు మినహా అందరి పని అయిపోయిందన్న తప్పుడు ఆలోచనతో చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అన్నఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని అన్నీ తానై నడిపిస్తున్న చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ కేడర్లోనూ, లీడర్లలోనూ ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా వ్యూహ రచన చేస్తున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ కుతంత్రాల కారణంగానే చంద్రబాబు అరెస్ట్ అయినప్పటికీ ఆయన పట్ల సానుభూతి అమాంతం పెరిగిపోయింది. ఏ మాత్రం ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్ సర్కారు తీరుపై వందల సంఖ్యలో జాతీయ నాయకులు వ్యతిరేకించారు. టీడీపీ అధినేతకు అండగా సంఘీభావం తెలిపారు. అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ కేడర్ ఉవ్వెత్తున ఎగసిపడింది. చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమంది. చంద్రబాబుకు అండగా నిచిచిన తెలుగు తమ్ముళ్లు తమ పార్టీ ప్రమాదంలో లేదని, అవసరమైనప్పుడు సత్తాచూపెడతామనిపించేలా నినదించారు. ఈ పరిణామాలన్నీ అధికార పార్టీని అయోమయంలో పడేశాయి. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందనుకుని ప్లాన్ ఛేంజ్‌చేశాయి. చంద్రబాబు పై సానుభూతి అమాంతం పెరిగిపోవడంతో అసలేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో తలపండిన నేతలతో సై అంటే సై అన్న చంద్రబాబుతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని వైసీపీ ఆలోచనలో పడిపోయింది.
ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ అంటూ లేని రోడ్లపై కుట్రలు కుతంత్రాలు చేసి యువనేతలోకేశ్‌ను కూడా అరెస్ట్‌చేయించాలనుకున్న ఆలోచనకు జగన్ బ్యాచ్ ఫుల్ స్టాప్ పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.. చంద్రబాబు అరెస్ట్ తో హుటాహుటిన ఢిల్లీ వెళ్లినలోకేశ్ రాష్ట్రపతికి జరిగిదంతా పూసగుచ్చినట్టు వివరించారు. ఏ మాత్రం ఆధారాలేకుండానే తన తండ్రికి అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తమ పార్టీ వెన్నంటి ఉండే సీనియర్ పొలిటిషియన్లతో లోకేశ్ రాజకీయ వ్యూహాలు రచించడంతో జగన్ బ్యాచ్ బ్యాక్ స్టెప్ వేసింది.
ఇప్పటికే తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేయించటం ద్వారా ఎదురైన షాక్ లతో చిక్కుల్లో పడ్డ వైసీపీ లోకేశ్ ను కూడా అరెస్ట్ చేయించటానికి వేసిన వ్యూహం కూడా వికటిస్తుందని, ఈ దశలో లోకేశ్ కూడా సానుభూతి పెరిగిపోతే ఆ పార్టీని శ్రేణులను ఆపటం కష్టమని వైసీపి ఓ నిర్ణయానికి వచ్చేసిందని తెలుస్తోంది. ఇవన్నీ 2024 ఎన్నికల్లో తమకు మైనస్ అవటం ఖాయమన్న అభిప్రాయంతో ఉంది. కొద్ది రోజుల్లోనే లోకేశ్ జాతీయ మీడియాలో సైతం హైలైట్ కావడం వైసీపికి మింగుడుపడని మరో అంశం. ఈ పరిణామాలన్నీ పరిశీలించాక అధికార పార్టీ కుట్రకు తాత్కాలికంగా బ్రేకులేసింది. ఈ క్రమంలోనే లోకేశ్ అరెస్ట్ విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తోంది.