అధికారం పోయిన తర్వాత జగన్ వింతగా వ్యవహరిస్తున్నారు. నవ్వి పోదురు గాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి కనిపిస్తోంది. సింగయ్య మృతి ఘటనపై జగన్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోగా..ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు జగన్.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు మేము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అంటూ ఏ మాత్రం సిగ్గు లేకుండా వాదిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్‌నే ఫాలో అవుతున్నారు. ఐతే గత ఐదేళ్ల జగన్ పాలన ఎలా సాగిందో ప్రజలు అప్పుడే మరిచిపోలేదు.ఇంకా ఆ దారుణాలు కళ్ల ముందే ఉన్నయి. ఐనప్పటికీ ఇప్పుడు వైసీపీ నేతలు నిజాయతీపరుల్లా చేస్తున్నా వ్యాఖ్యలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష రాజకీయ కార్యక్రమాల కోసం బయటకు వస్తే అడ్డుకోని సందర్భమే లేదు. పోలీసులతో అడ్డుకోవడం ఓ ఎత్తు అయితే పార్టీ కార్యకర్తలతో రాళ్లు దాడులు చేయించేవారు. కుప్పం నుంచి మార్కాపురం వరకూ చంద్రబాబుపై ఎన్ని రాళ్ల దాడులు జరిగాయో లెక్కే లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తే..స్టూల్ మీద నిలబడి మాట్లాడుతున్నారని స్టూల్ కూడా ఎత్తుకెళ్లేవారు. ఇక పవన్ కల్యాణ్ ను ఎన్ని సార్లు అడ్డుకున్నారో విశాఖ లాంటి ఘటనలే నిదర్శనం.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలకు అసలు హక్కులనేవి లేవు అన్నంతలా వ్యవహరించింది వైసీపీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో లేకపోతే పార్టీ కార్యకర్తలతో కుట్రలు చేసి..ప్రజల్లోకి వెళ్లకుండా అప్పుడు కుట్రలు చేశారు. చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని నివేదికలు అందడంతో అప్పుడు కేంద్రం ఆయన సెక్యూరిటీని పెంచేంది. ఇప్పుడు జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనంలోకి వెళ్తున్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుడా..జనాన్ని తొక్కి చంపేసి,సెక్యూరిటీ ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కనీస విచక్షణ లేకుండా వైసీపీ నేతల మాటలు ఉంటున్నాయి.