మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దొరికిన ప్రతి శాఖలో చేతివాటం ప్రదర్శించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంను కూడా అపవిత్రం చేసిన విషయం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. కాసుల కోసం నాణ్యతలో రాజీ పడి అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసిన విషయాన్ని ఇప్పుడు హిందూ సమాజం మొత్తం జీర్ణించుకోలేకపోతోంది. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా, చేప నూనె, గొడ్డు మాంసం నుంచి తీసిన నూనెను వాడినట్లుగా తాజాగా రిపోర్టులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
లడ్డూ ప్రసాదం తయారీలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యి రోజుకు టీటీడీకి వేల కిలోలు అవసరం ఉంటుంది. ప్యూర్ నెయ్యి కావాలంటే ఖరీదు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకని గత పాలకులు కక్కుర్తి పడి లేదా డబ్బులను పక్కదారి పట్టించడం కోసం నెయ్యిని కల్తీ చేశారని అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంటేనే.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిసిన భక్తులు అంతా నివ్వెరపోతున్నారు.
అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూలు దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతాయి. అలా అయోధ్య రామ మందిరానికి కూడా టీటీడీ లక్ష లడ్డూలు పంపింది. అయితే, ఈ లడ్డూల్లో వాడిన నెయ్యి కూడా ఆవు పంది మాంసం నుంచి తీసిన నూనె అని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయోధ్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ పరిణామం జరిగింది. ఈ విషయం తెలిసిన వారంతా అప్పట్లో టీటీడీ అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల తాలుకు వీడియోలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
నెటిజన్లు సైతం విపరీత స్థాయిలో స్పందిస్తున్నారు. దేవుడి ప్రసాదంలో నీచమైన పదార్థాలు కలిపి, కల్తీ చేసిన నిన్ను ఆ దేవుడు అంత తేలిగ్గా వదలబోడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘నీ రోత దేశం మొత్తం పాకిస్తున్నావ్ కదరా జగన్’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. జగన్ ఒక హిందూ ద్రోహి అని కూడా కామెంట్లు చేస్తుండడం భక్తుల మనోభావాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు.











