వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో సంచలన ప్రెస్ మీట్‌కి రెడీ అవుతున్నారని మీడియాలో బుధవారం రాత్రి నుండి ప్రచారం జరుగుతోంది.. ఇది లైవ్ ప్రెస్ మీట్ కాదని, రికార్డెడ్ అని తెలుస్తోంది.. ఇది తన అరెస్ట్‌పై ఆయన స్పందించే చాన్స్ ఉందని వైసీపీ వర్గాల నుండి అందుతోన్న అనధికార సమాచారం.. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో పలువురిని అరెస్ట్ చేసింది సిట్… లిక్కర్ స్కామ్‌లో అసలు ఏం జరిగిందో, టాప్ టు బాటమ్, ఇన్ అండ్ అవుట్.. మెయిల్స్ సాక్ష్యాలతో సహా మొత్తం సిట్ ఆధారాలు సేకరించినట్లు జగన్‌కి క్లూస్ అందినట్లు తెలుస్తోంది.. దీంతో, ఏ క్షణమైనా జగన్ అరెస్ట్ ఖాయం అని వైసీపీలో చర్చ సాగుతోంది..
ఏపీలో లిక్కర్ స్కామ్…. దేశంలో ఎక్కడా జరగని ఓ వినూత్న స్కామ్.. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం సెంట్రలైజ్డ్ కరెప్షన్.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పక్కాగా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు చరిత్రలో ఆధారాలు లేవు.. అంతటి సంచలనం సృష్టిస్తోంది ఇది.. మరోవైపు, తాజాగా సిట్ సేకరించిన వివరాలతో గురువారం సాయంత్రం హస్తినకు బయలుదేరుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. లేటెస్ట్ డేటాలో పిన్ టు పిన్.. స్కామ్ ఎలా జరిగిందో పక్కా ప్రూఫ్స్‌తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి ఆధారాలు అందించనున్నారని, ఆ తర్వాతే అరెస్ట్‌పై ఒక క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలకు అందుతోన్న సమాచారం..
మహానాడుకి కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం అవుతుండడం, ఇటు పార్టీ వర్గాలతోపాటు, వైసీపీలోనూ చర్చ సాగుతోంది.. ఈ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు.. కానీ, హోమ్ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ ప్రత్యేకత సంతరించుకోనుందని తెలుస్తోంది.. అయితే, జగన్ అరెస్ట్ మహానాడుకి ముందు ఉంటుందా..? తర్వాత ఉంటుందా..?? అనేది ఆసక్తికరంగా మారుతోందని రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది..
ఈ పరిణామాలన్నింటిపై జగన్ తన రికార్డెడ్ ప్రెస్ మీట్‌లో వివరించనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.. లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని, తన హయాంలో తీసుకున్న విధాన పరమైన నిర్ణయం అని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని జగన్ ఈ ప్రెస్ మీట్‌లో ఆరోపించనున్నట్లు సమాచారం.. తన అరెస్ట్‌పై జగన్ ఇప్పటివరకు బహిరంగంగా కామెంట్స్ చేయలేదు.. మొదటిసారి స్పందించనున్నట్లు వైసీపీ వర్గాల నుండి అందుతోన్న లీక్.. ఇప్పటికే జగన్ కోటరీ మొత్తం లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయింది.. దీంతో, తన అరెస్ట్ అనివార్యం అని జగన్‌కి స్పష్టంగా తెలుసని, దీనిపై కూటమి సర్కార్‌పై బురద చల్లే ప్రయత్నం చేయాలని, జగన్ లెక్కలు వేసుకున్నారట.. అందుకే, ఆయన హడావిడిగా ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్‌కి రెడీ అయినట్లు సమాచారం.. ఏది ఏమయినా, లిక్కర్ స్కామ్‌లో ఆధారాలన్నీ పక్కాగా దొరికిన తర్వాతే ప్రభుత్వం ముందుకు కదులుతోంది.. ఈ అంశంపై వైసీపీ ఎంతటి లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తే అంత బెటర్, లేదంటే పొలిటికల్‌గానూ అది రివర్స్ అయ్యే చాన్స్ ఉంది.. మరి, వైసీపీ అధినాయకత్వం ఈ ఇష్యూని ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి..











