మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి బిగ్‌షాక్ తగిలింది.కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అనారోగ్య సమస్యల పేరుతో నాని అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, నాని పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోరారు.
వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నాని..టీడీపీ నేతలపై నోరేసుకుని పడిపోయేవారు. బూతులతో రెచ్చిపోయేవారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను చెప్పలేని రీతిలో, అసభ్యపదజాలంతో నాని దూషించేవారు. ఇక అధికారం అండ చూసుకుని నియోజకవర్గ పరిధిలో అనేక అక్రమాలు చేశారు. అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించారు. నానికి చెందిన మట్టి, గ్రావెల్ మాఫియా పెద్ద ఎత్తున దందాలు చేసింది. వేల కోట్ల ప్రజాధనాన్ని నాని, ఆయన అనుచరులు వెనకేసుకున్నారు.
ఇక వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే కొడాలి నాని సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు. అనారోగ్య కారణాల పేరుతో ఇటీవల ముంబైలో శస్త్ర చికిత్స చేసుకున్నారు. విశ్రాంతి పేరిట ప్రస్తుతం హైదరాబాద్‌కు పరిమితమైన నాని..త్వరలోనే మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా నానిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో నాని అమెరికా పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నాని దేశం విడిచి వెళ్లకుండా లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక, కొడాలి నాని అరెస్టుకు సైతం ముహుర్తం ఫిక్స్ అయినట్లేనని సమాచారం.











