ఏపీలో కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాలు జనం అందరికీ అర్థం అవుతున్నాయి. మాజీ సీఎం
చంద్రబాబు అరెస్ట్ కు కుట్ర ఎలా జరిగిందో అన్న అంశంపై కూడా ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల నేతలతో పాటే ప్రజలు కూడా చైతన్యంగా ఆలోచిస్తూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఆయన బంధువర్గంలో కొత్త టెన్షన్ మొదలైంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలో కొస్తే పరిస్థితేమిటన్న ప్రశ్నలు జగన్ బంధుగణాన్ని వేధిస్తున్నాయి. అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ ను కోర్టు 18 నెలలు జైల్లో ఉంచింది. వైసీపీ అధికారంలోకోచ్చాక లెక్కలేనంత అవినీతి బయటకొస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు రకరకాల మార్గాల్లో అందినకాడికి రకరకాల రూపాల్లో సంపాదిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టయ్యాక జగన్‌పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.
ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఇప్పుడు ఆ పార్టీ చిన్నస్థాయి లీడర్ల నుంచి జగన్ బంధు వర్గంలోనూ టెన్షన్ పెంచుతోంది. ఈ వ్యతిరేకతో అధికారం కోల్పోవటం ఖాయమనిపిస్తున్న వేళ ఒకొక్కరూ తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అవినీతి పరుల తాట తీస్తామన్న తెలుగుదేశంతో జత కట్టిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా వారిని భయపెడుతున్నాయి. అధికారంలోకొస్తే తమ అవినీతి ఎక్కడ బటపడుతుందోనని, జైలుకెళ్లడం ఖాయమా అన్న ఆందోళనను వారిలో ఇప్పటికే మొదలైంది.
ఏపీకి సీఎం జగన్ ఎందుకు కావాలి అన్న అంశంపై ఒంగోలులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన భయాన్ని వ్యక్తం చేశారు కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే మన పరిస్థితేమిటన్న అభిప్రాయాన్ని ఆయన ఈసమావేశంలో బహిరంంగానే చెప్పేశారు. చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్ష తప్పదన్న సంగతి మరచిపోయిన మిగతా నేతలు కూడా లోలోపల ఈ అంశంపై చర్చించుకుని వాట్ నెక్ట్స్ అంటూ ఆలోచనలో పడిపోయారట. స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే ఈ విషయం చెప్పటం వైసీపీలో అభద్రతా భావం మొదలైందనటానికి ఓ పెద్ద ఉదాహరణ.