రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..కానీ.., దాని కోసం ఒక ప్లాన్ .. అందులో మార్పులంటూ వైసీపీ ప్రభుత్వం సీఐడీ ఉసిగొల్పి కేసు నమోదు చేయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. సీఐడీ ఆదేశాల మేరకు ఆయన మంగళవారం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐడీ పోలీసులు లోకేష్ ను ప్రశ్నించారు. విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకొచ్చిన లోకేష్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు పిలిచి.. దానికి సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగి కాలయాపన చేయించారని లోకేష్ మండిపడ్డారు. గంటలకొద్ది విచారణ పేరుతో కూర్చొపెట్టి ఆ కేసుకు సంబంధంలేని ప్రశ్నలు అడిగారని.. గతంలో తాను పనిచేసిన తీరును అడిగి.. వాటినే తిప్పి అడిగారన్నారు. విచారణ మొత్తం కేవలం తెలుగు దేశాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు జగన్ రెడ్డి ఆడుతున్న కుట్ర అని అందరికీ ఒక క్లారిటీ వచ్చిందన్నారు. నీటి ప్రాజెక్ట్ లకు చంద్రబాబు చేసిన ఖర్చులో 10 శాతం కూడా జగన్ ఖర్చు పెట్టలేదని చెప్పారు. రేపు మరోసారి విచారణకు రావాలని సీఐడీ సూచించడంతో తిరిగి మరోసారి అధికారులు లోకేష్ ను ప్రశ్నించనున్నారు.
జగన్ రెడ్డి అవినీతి పదేపదే ప్రశ్నించడం.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి.. ప్రజలకు వివరిస్తుంటే ఓర్చులేకే అక్కసుతో చంద్రబాబుకు సంబంధం లేని కేసులో అరెస్ట్ చేశారన్నది వాస్తవం. ఆయన అరెస్ట్ తో ఏపీలో ప్రశ్నించిన వారిపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తుంది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే ఇన్నరింగ్ రోడ్డులో లోకేష్ మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి.., మరికొంతమందిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విధితమే.