టీజర్‌లో కొత్తదనం లేదు… ఇటు, సోనియా గాంధీ ఇమేజ్‌ని చూపించడానికే భయపడ్డాడు వర్మ అనే కామెంట్స్.. ఇటు, బొత్స, ధర్మాన, ఆనం, చిరంజీవిలాంటి కాంగ్రెస్ నేతల కామెంట్స్ లేవు… కేవలం చంద్రబాబు, టీడీపీని నెగిటివ్ చెయ్యడం కోసమే వర్మ వ్యూహం అని అర్ధం అయ్యాక.. పసలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
అనుకున్నదొక్కటి ఐంది ఒక్కటి బోల్తా కొట్టావులే బుల్ బుల్ పిట్టా అన్నటుండి సీఎం జగన్ పరిస్థితి. ఆర్జీవీ ఎదో చేస్తాడు అనుకుంటే , ఇంకేదో చేసి జగన్ కె బాణం ఎక్కు పెట్టినట్టుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా టీజర్ విడుదలైంది. అసలు ఆ సినిమా టీజర్ లో ఏముంది? రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేసాడు? ఎలాంటి అంశాలు పుండపరిచాడు అని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది..
2009 మొదలుకొని వైస్ జగన్ మోహన్ రెడ్డి 2019 సీఎం అయేవరకు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అనేక సంఘటనలను ప్రస్తావించినటు తెలుస్తోంది.సెన్సషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఆంధ్ర రాజకీయాలపై సినిమా అనే అస్త్రాన్ని వదిలాడు. వ్యూహం సినిమాలో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించాడు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి YSR మరణం నుంచి 2019లో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగిన చాలా విషయాలను ఈ టీజర్‌లో చూపించాడు రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం టీజర్ లో మొతంగా చుస్తే వైస్సార్ హెలికాఫ్టర్ 2009 సెప్టెంబర్ 2 న మిస్ ఐన దగ్గరనుండి , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్తా విని వై ఎస్ కుటుంబ సభ్యులు రోదించిన దృశ్యాలు ఉన్నాయ్.. ఆ తరువాత రోశయ్య సీఎం అవడం, ఆయన జగన్ ని కలిసినట్టు చూపించాడు, అలాగే కాంగ్రెస్ అధిష్టానం జగన్ కి వార్నింగ్ ఇచ్చినట్టు టీజర్ లో చూపించాడు.. తదనంతరం జగన్ అరెస్ట్, విడుదల, పాదయాత్ర, తదితర విషయాలను చూపించారు, ఇదంతా చూడటానికి, జగన్ భజన బానే ఉంది అసలు మ్యాటర్ సినిమాలో చూపించగలడా ఆర్జీవీ..
అయితే టీజర్ చుస్తే మాత్రం ఒక్కటే అర్ధం అవుతుంది, ఆర్జీవీ టార్గెట్, సీఎం వైస్ జగన్ టార్గెట్ ఒకటే అది టీడీపీ అని అర్ధమవుతుంది, కానీ 2009 తరువుత జరిగిన సంఘటనలు చుపించడానికి ఆర్జీవీ ధైర్యం సరిపోలేదని తెలుస్తోంది, అసలు విలన్లు కాంగ్రెస్ పేదలు అని, జగన్ ని ఒంటరరిని చేసి ఒక ఆటాడుకున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన, ఆనం రాంనారాయణ రెడ్డిల గురించి సినిమాలో చూపించే సాహసం చేయలేదని తెలుస్తుంది. అప్పట్లో చిరంజీవి చేసిన కామెంట్లు పెను దుమారాన్నే లేపాయి ఆ ఊసే లేదు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మెయిన్ లీడర్లు , అప్పట్లో జగన్ మీద చేసిన ఆరోపణలు, జగన్ పై సిబిఐ దాడులు గాని ఇవేవి చూపించకుండా ఓన్లీ టీడీపీ ని, చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసిన సినిమా అని అర్ధమవుతుంది. జగన్ వేసిన ప్లాన్ జగన్ కె ముప్పు కలిగేలా ఉంది. అభివృద్ధి , సంక్షేమ పథకాలు మొదలైన వాటిమీద లేని నమ్మకం ఆర్జీవీ సినిమా వల్ల ప్రజలు మారి, మల్లి పదవి కట్టబెడతారు అనుకుంటే అది జగన్ పగటి కలగానే ఉంటుంది తప్ప నిజం అవదు, ఏది ఏమైనా జేగం తీసుకున్న గోతిలో జగన్ పడినట్టు తెలుస్తోంది.