ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనం, ఆయన ఏదైనా గ్వరమెంట్ కి సర్వే చేసాడంటే అది నూటికి నూరుపాళ్లు నిజమవుతుంది అని రాజకీయనాయకులకు తెలుసు. అందుకు పీకే సర్వే అంటే ఎమ్మెల్యేలు , ఎంపీలు గడగడా వణికిపోతారు. అయితే ఈ మధ్యే ఆయన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ప్రశాంత్ కిశోరె చేసిన సర్వేలో షాకింగ్ రిపోర్ట్ వాచినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీలోని కనీసం 100 నియోజకవర్గాల్లో అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అయితే గత కొంత కాలంగా వైసీపీ నాయకులూ చేస్తున్న అరాచాకాల పుణ్యమా అని మారి దారుణంగా వైసీపీ పఠనం మొదలైంది అని, అలాగే వైసీపీ నాయకులూ చంద్ర బాబు భార్యను దుర్భషలాడటం, టీడీపీ నాయకుల మీద, టీడీపీకార్యాలయాల మీద వైసీపీ నాయకుల దాడులు, అధికార పార్టీ పేదల పెత్తన్నం, అద్వానంగా రోడ్లు, ఇసుక నిరుద్యోగ వ్యవస్థపెరగడం, సంక్షేమ పతకాలు ప్రజలకు అందకపోవడం వైసీపీ విశ్వసనీయతను దెబ్బతీశాయి అని తెలుస్తోంది.
క్రితం కంటే ప్రభుత్వోద్యోగుల మధ్య ఉన్న అసమ్మతి ప్రభుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్నికలను తిప్పికొట్టిన తటస్థ ఓటర్లు కేవలం రెండేళ్లలో జగన్ పాలనకు దూరమయ్యారని సర్వే పేర్కొంది. అలాగే మేజర్ ఏరియాలలో వైసీపీ డిపాజిట్లు కూడా దక్కడం కష్టంగా ఉందని, ఈ సారి టీడీపీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని, మరోసారి టీడీపీ సీఎంగా చంద్ర బాబు నాయుడు ఖాయంగా కనపడుతుందిఅని సర్వే రిపోర్ట్ తెలిపింది. పీకే ఇచ్చిన సర్వే రిపోర్ట్ పుణ్యమా అని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది,వైసీపీ తలపెట్టిన గడప గడపకి ప్రోగ్రాంలో ఆ వ్యతిరేకత సుస్పష్టంగా తెలుస్తోంది, వైసీపీనాయకులను అభివృద్ధి ఫలాలు ఎక్కడ ఉన్నాయి చూపించాలి అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇదే కనుక జరిగితే జగన్ పార్టీ కి ప్రతిపక్షం హోదా కూడా దక్కడం కష్టంగానే కనపడుతుంది.