తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల నేడు ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె అనుచర నేతలు, శ్రేణులు భారీగా సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి సభకు అనుమతి ఇవ్వడంతో, ఈ మేరకు సభ జరగనుంది. ఇప్పటికే ఖమ్మంలో పలుచోట్ల భారీ ఎత్తున షర్మిల కటౌట్లు పెట్టారు. అయితే ఈ సభకు వైఎస్ విజయమ్మే ముఖ్య అతిథిగా రానున్నారు. తల్లి సమక్షంలోనే ఆమె పార్టీ ప్రకటన చేస్తారని ముఖ్య అనుచరులు చెప్తున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి ఎల్‌బీనగర్ మీదుగా 9.30 గంటలకు హయత్‌నగర్ చేరుకోనున్నారు. అక్కడ అభిమానులతో సమావేశమైన తర్వాత మధ్యాహ్న సమయంలో ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. తెలంగాణలోని వైఎస్ అభిమానులు ఇప్పటికే ఖమ్మంకు తరలివెళ్తున్నారు. ఆ సందర్భంగా ఆమె అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Must Read ;- సీఎం జిల్లాలో 20 కరువు మండలాలా వైఎస్ షర్మిల