వైఎస్ షర్మిల ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే లక్ష మందితో జనసమీకరణ చేసి ఘనంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న షర్మిలకు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే లభించింది. ఖమ్మం భారీ బహిరంగ సభకు ఓ ముఖ్యమైన గెస్ట్ ను పిలవనున్నట్లు తెలుస్తోంది. తన తల్లి వైఎస్ విజయమ్మనే ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు కూడా తల్లి సమక్షంలోనే చెప్పాలని షర్మిల భావిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిలకు మొదట్నుంచీ వైఎస్ విజయమ్మ అండగా నిలుస్తూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైఎస్ విజయమ్మ షర్మిల సభకు వెళ్లినా.. పార్టీలో మాత్రం క్రియాశీలకంగా ఉండదని షర్మిల అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- రాజన్న రాజ్యం కోసం షర్మిల ఏపీలో పోరాడాలి.. వైసీపీ ఎంపీ రఘురామరాజు











