నిజమా.. దేవుడు స్ర్కిప్ట్ మార్చేశాడా? రాత్ గయీ..బాత్ గయీ. ఇక సైతాన్ గిరి పరార్.. ఏపీలో మళ్లీ సైకిల్ పాలన ఖరారు. కొంత కాలంగా టీడీపీ నేతలు ఆ లెవల్‌లో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. దేవుడు స్ర్కిప్ట్ మార్చేశాడని , వైసీపీ పనైపోయిందని పదే పదే చెప్తున్నారు. మరి అదే నిజామా? అలా జరుగబోతుందా? టీడీపీవి రాజకీయ విమర్శలు కావచ్చు. దేవుడు స్ర్కిప్ట్ మార్చాడనే మాటను ప్రొజెక్ట్ చేయడం స్ట్రాటెజీలో భాగమూ కావచ్చు. కానీ వైసీపీ పనైపోయిందనే ఇన్ సైడ్ టాక్ వచ్చే ఎన్నికల్లో ఏం జరుగనుందో ఔట్‌లైన్‌ను తేల్చేసింది.
. . ఫ్యాన్ జీరో నెంబర్… సైకిల్ హీరో నెంబర్ 1 .ఇదే ఇన్‌సైడ్ టాక్. ఇక జగన్ ఇడుపులపాయ ఇంటి దారి పట్టక తప్పదనేది ఇన్‌సైట్ ఇండికేషన్. వై నాట్ 175 అనే ఓవర్ కాన్షిడెన్స్‌కు ఏపీ జనతా కర్రుకాచి వాత పెట్టడానికి సిద్దంగా ఉన్నారనడానికి ఇన్‌సైడ్ టాక్ ఓ సంకేతం.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 125 ప్లస్ సీట్లు గ్యారెంటీ అంటోన్న తెలుగు తమ్ముళ్ల కాన్షిడెన్స్ సజ్జలకే కాదు జగ్గుదాదా భజన చేసే గజకర్ణ.. గోకర్ణ ..గడ్డం..అడ్డం బ్యాచ్‌ల డ్యాష్ డ్యాష్‌లో వణుకురేపుతోందట.అదీ ఇన్‌సైడ్ టాక్ ఇంపాక్ట్.
ఎస్.. టీడీపీ అధికారంలోకి రావాలని..చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యమనే పబ్లిక్ పల్స్ సర్వేలో రిఫ్లెక్టయ్యాయి. ఇటీవల ఏపీలో ఇన్‌సైడ్ ఎలక్షన్ టీమ్ నిర్వహించిన బెంచ్ మార్క్ సర్వే ప్రకారం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే హవా.
ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే తేల్చిన లెక్క ప్రకారం ఏపీలోని 175 నియోజవర్గాల్లో టీడీపీ 88 నుంచి 104 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. వై నాట్ 175 అని ప్రగల్బాలు పలికిన వైసీపీ అతివిశ్వాసంపై ప్రజలు అవిశ్వాసం ప్రకటించే సమయం ఆసన్నమైంది. వైసీపీ గెలిచే అవకాశాలున్న సీట్ల లెక్క కేవలం 65 నుంచి 81 మధ్యే. తగ్గుడే కానీ అంతకు మించి ఒక్క సీటు నెగ్గుడు ఉండదంటున్నాయి టీడీపీ శ్రేణులు.ఇర ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ప్రకారం జనసేనకు నాలుగు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం. కొసమెరపు ఏంటంటే కోస్తా ఎటేపు మొగ్గితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనేది ఓ సెంటిమెంట్. ఇన్‌సైడ్ సర్వేలో టీడీపీ ప్రభంజనం కన్పించింది. కోస్తాలోని 84 సెగ్మెంట్లలో టీడీపీదే గెలుపు పిలుపు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఏపీ సమగ్రామాభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వస్తున్నారని.. ఇన్‌సైడ్ సర్వేనే అందుకు నిదర్శనం అంటున్నారు టీడీపీ నేతలు.
అధికార వైసీపీ విధానాలపై వ్యతిరేకత, ఊకదంపుడు ప్రకటనలు ప్రచారాలు , తుగ్లక్‌ను తలపించిన మూడు రాజధానుల వివాదం, మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి, బూతుపురాణం . బాబాయిపై గొడ్డలి వేటు.. సొంతింట్లోనే రెండు పార్టీలు…నడుస్తోన్న చరిత్రను ప్రజలు బాగా గమనిస్తున్నారనడానికి ఇన్‌సైడ్ బెంచ్ మార్క్ సర్వే సాదృశ్యమనేది టీడీపీ నేతల మాట. అవినీతి అరాచక పాలనతో విసిగి వేసారిన ప్రజలు వైసీపీని విసిరి పారేసే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు, నారా లోకేష్ యువగళంకు వస్తోన్న అనూహ్య స్పందనతో టీడీపీ ప్రభంజనం ఖాయమైందన్నారు. జగన్ ముందస్తుకు వచ్చినా రాకపోయినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా..సైకిల్ హవాను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటున్నారు టీడీపీ నేతలు. గ్యారెంటీగా 125కు మించి సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వైసీపీ మాటేంటి? ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఇంపాక్ట్‌తో ఇన్‌సైడ్‌గా వైసీపీలో వణుకు మొదలైందా? ముందస్తు ఎన్నికలపై వెనుక అడుగు వేయడానికి రీజన్ అదేనా? ఇలా చర్చల జోరందుకున్నాయి మరి.
హైదరాబాద్ నుంచి ఏపీకి.. రివర్స్ మైగ్రేషన్..! బాబు సర్కార్ సూపర్ ..!
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్...











