పాపం విజయమ్మ.. ఒకప్పుడు ముఖ్యమంత్రి భార్యగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. తాజాగా ఓ ముఖ్యమంత్రికి తల్లిగా మాత్రం ఆమె అధికార దర్పాన్ని అనుభవించలేకపోతున్నారు.. చివరికి తన కొడుకు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో విబేధాల పరిష్కారం కోసం విజయమ్మ సజ్జల సాయం కోరారనే అంశం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి సొంత కుటుంబంతో అభిప్రాయ బేధాలున్నాయనేది ఓపెన్ సీక్రెట్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది.. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు తర్వాత చెల్లెలు వైఎస్ సునీతతోనూ విబేధాలు తలెత్తాయి.. అందుకే, సొంత అన్న జగన్ సర్కార్ పైనే ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు.. తన తండ్రి హత్య కేసులో అసలైన నిందితులకు శిక్ష పడాలని ఆమె తీవ్రంగా కృషి చేస్తున్నారు..
తల్లి విజయమ్మతో జగన్‌కి పూడ్చలేనంత దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.. ఇటీవల హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లిన విజయమ్మ.. కొడుకు జగన్‌తో కొన్ని అంశాలను చర్చించడానికి జగన్‌కి అత్యంత సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లారట.. వైఎస్ ఫ్యామిలీ నుండి ఫోన్ కాల్ వస్తేనే భయపడుతూ వారి ఇంటికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి సజ్జలది.. ఇటీవల సీన్ మారింది.. జగన్ అంటే సజ్జల.. సజ్జల అంటే జగన్ గా మారిపోయింది..
ఈ సంకేతాలని ధృవపరుస్తూ సజ్జల ఇంటికి విజయమ్మ.. తన కూతురు తరఫున రాయబారం కోసం కొడుకు అపాయింట్‌మెంట్ కోరారని తెలుస్తోంది.. ఈ అంశంపై వైఎస్ సన్నిహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. కొడుకు, కోడలిని కలవడానికి, వారితో కొన్ని అంశాలు చర్చించడానికి సజ్జల సాయాన్ని తీసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట..
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల పంపకం అంశంలో జగన్, షర్మిల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని చర్చ సాగుతోంది.. తనకు ఇస్తానని హామీ ఇచ్చిన ఆస్తులను పంచకపోవడంతో అన్నపై షర్మిల తిరుగుబాటు చేసిందని, తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని వైఎస్ ఫ్యామిలీ సన్నిహితుల మాట.. ఇటీవల షర్మిల పార్టీకి భారీగా నిధులు కావాల్సి వస్తోంది.. మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.. దీంతో, షర్మిలకు కావలసిన నిధుల కోసం జగన్ సాయం కోరడానికి సజ్జల రాయబారాన్ని కోరారట విజయమ్మ..
రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కి సజ్జల టీమ్‌తోనూ విజయమ్మ ఇదే అంశాన్ని ప్రస్తావించారట.. అటువైపునుండి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో మరోసారి షర్మిల పార్టీకి నిధుల అంశం, ఆస్తుల పంపకంపై జగన్ మనసులో మాట తెలుసుకోవడానికి విజయమ్మ సజ్జల సాయం కోరారట. సజ్జల ఇంటికి విజయమ్మ వెళ్లిన సమయంలో ఆయన లేకపోవడంతో ఇదే విషయాన్ని ఆయన భార్యకి చేరవేసి వెను తిరిగారని సమాచారం..
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలకు ప్రధాన కారకులలో సజ్జల ఒకరని కొందరి కుటుంబ సభ్యుల అభిప్రాయం.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, చివరికి ఆయనే ఫ్యామిలీ మెంబర్లకి అపాయింట్‌మెంట్‌లు ఫిక్స్ చేసే రేంజ్‌కి ఎదిగారు.. ఇప్పటికి అయినా, జగన్‌తో తల్లి, చెల్లికి మధ్య గ్యాప్ తగ్గుతుందా?? అంతరాలు కరిగిపోతాయా?? లేదా అనేది చూడాలి.