తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన మూల్పూరి కళ్యాణి అరెస్టు జగన్ రెడ్డి ప్రభుత్వ పైశాచికాలకు పరాకాష్ట.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కక్ష సాధింపునకు నిదర్శనం.
ఎవరైతే తన గెలుపునకు పాటుబడ్డారో వాళ్లనే టార్గెట్ చేయడం, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఎమ్మెల్యే వంశీ నైజం..రాబోయే ఎన్నికల్లో తన ఓటమి తప్పదనే నైరాశ్యంతో, వైసిపివాళ్లే వెన్నుపోటు పొడుస్తారన్న భయంతో, బిక్కుబిక్కుమంటూ, దిక్కుతోచని స్థితిలో చివరికి మహిళలనూ టార్గెట్ చేసే నీచానికి వంశీ దిగజారడం హేయం..
‘‘హనుమాన్ జంక్షన్ మొత్తం నేనే చూసుకుంటా, నువ్వు మిగతా నియోజకవర్గం చూసుకో అన్నా’’ అని భరోసా ఇచ్చి, సొంత డబ్బులతో పట్టణంలో ఇంటింటికీ తిరిగి 2019లో వంశీని గెలిపించిన కల్యాణి ఇంటిపైనే, పోలీసులతో దాడిచేయించి కనీసం నైట్ డ్రస్ మార్చుకోడానికి కూడా వీల్లేదంటూ ఆ కుటుంబానికింత క్షోభ పెట్టిన పాపం ఊరికే పోదు, తీరని శాపమై వెంటబడి తరుముతుంది..పార్టీకి ద్రోహం చేసిన వంశీకి ఎప్పుడెప్పుడు రిటన్ గిఫ్ట్ ఇద్దామా అని గన్నవరం టిడిపి కార్యకర్తలే కాదు, నియోజకవర్గ ప్రజలంతా ఎదురెదురు చూస్తున్నారు.
గెలిచిన 6నెలల్లోనే టిడిపి నుంచి వైసిపిలోకి ఫిరాయించిన వంశీకి ఆ పార్టీలోవారే గుంతలు తీస్తున్న నేపథ్యంలో వారినేమీ చేయలేక, తెలుగుదేశంవారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం నీచాతినీచం..తనతో పాటు పార్టీమారాలని తెచ్చిన ఒత్తిళ్లు, పెట్టిన ప్రలోభాలను లెక్కచేయకుండా పసుపు జెండాను మోస్తున్నవారిపై జగన్ రెడ్డి అండతో, కొందరు పోలీసుల సహకారంతో తప్పుడు కేసులతో, అక్రమ నిర్బంధాలతో దారుణమైన వేధింపులకు దిగడం గర్హనీయం..
టిడిపిని వీడి వైసిపిలోకి రాలేదనే అక్కసుతోనే మూల్పూరి కల్యాణిని, ఆమె భర్త సురేంద్రను, కుటుంబాన్ని టార్గెట్ చేశారనేది అందరికీ తెలిసిందే..కల్యాణికి తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించడం వంశీకి కన్నెర్ర అయ్యింది.. కరోనా కల్లోలంలో ఎమ్మెల్యేగా హనుమాన్ జంక్షన్ ప్రాంతాన్ని వంశీ నిర్లక్ష్యం చేస్తే, తిండి లేక అల్లాడే పేదలకు రోజూ 200 మందికి అన్నదానం చేసిన కల్యాణి కంటు అయ్యింది. గన్నవరం టిడిపి ఇన్ ఛార్జి దివంగత బచ్చుల అర్జునుడు ఎప్పుడొచ్చినా, ఏ పిలుపిచ్చినా ముందుండి కల్యాణి కుటుంబం విజయవంతం చేయడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఇన్నాళ్లు తనను సొంత అన్నకంటే మిన్నగా గౌరవించిన ఆమె వ్యక్తిత్వ హననానికి వైసిపి పేటిఎం బ్యాచ్ తో చేయించే నీచానికి కూడా దిగజారాడు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20 న వైసిపి గుండాల విధ్వంస కాండ రాష్ట్రం మొత్తం చూసింది..ఆరోజు కళ్యాణి కారును కూడా వైసిపి మాఫియా మూకలు ధ్వంసం చేశాయి. నిందితులపై చర్యలు తీసుకోకుండా, మళ్లీ బాధితులపైనే ఎదురు కేసులు పెట్టిన ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలోనే చూస్తున్నాం.. గన్నవరం విధ్వంసకాండ, అల్లర్లలో కూడా కళ్యాణి పై 2 తప్పుడు కేసులు బనాయించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి నాన్ బెయిలబుల్ అక్రమ కేసులు పెట్టి 60రోజులుగా వేధిస్తున్నారు, ఆమె తల్లిదండ్రులు పూర్తిగా అనారోగ్యం పాలయ్యారు..సోమవారం( 10 ఏప్రిల్ 2023)నాడు ఆమె ఇంట్లోకి అక్రమంగా చొరబడి, కనీసం నైట్ డ్రస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా, కల్యాణిని పెట్టిన వేధింపులు అన్నిఇన్నీ కావు..అదేమని ప్రశ్నించిన ఆమె భర్తపై ఇంకో తప్పుడు కేసు బనాయించారు..
జగన్ రెడ్డి ప్రభుత్వ అకృత్యాలను, ఎమ్మెల్యే వంశీ బరితెగింపును తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఇతర నాయకులంతా ఖండించారు, కల్యాణి కుటుంబానికి మద్దతుగా నిలిచారు.
మూల్పూరి కల్యాణికి జరిగిన అన్యాయం, ఆమె కుటుంబానికి కలిగిన మానసిక క్షోభకు ఎమ్మెల్యే వంశీ మూల్యం చెల్లించక తప్పదని టిడిపి శ్రేణులంతా ఆగ్రహిస్తున్నాయి.దీనికింతకింత శాస్తి తప్పదు, అట్టుకు అట్టున్నర బదులిస్తామని మండిపడ్తున్నారు. కల్యాణి కంటిమంటలకు వల్లభనేని వంశీ రాజకీయ జీవితం శలభంలా మాడిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు..ఆడబిడ్డల ఉసురు పోసుకున్న రాక్షసుల గతి ఏమైందో, గన్నవరం రాక్షసుడికీ అదేగతని ధ్వజమెత్తుతున్నారు.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...