మొదటి నవరత్నంలో చెప్పిందిదే..: ‘‘వైఎస్సార్ రైతుభరోసా’’-ప్రతిరైతుకు ఏటా రూ 12,500చొప్పున రెండో సంవత్సరం నుంచి 4ఏళ్లలో రూ 50వేలు-వడ్డీలేని పంటరుణాలు-ఉచితంగా బోర్లు-పగటిపూట 9గంటలు ఉచిత విద్యుత్-ఆక్వా రైతులకు యూనిట్ రూ 1.50కే విద్యుత్-రూ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి-రూ 4వేల కోట్లతో విపత్తు సహాయనిధి-ప్రతి అసెంబ్లీలో కోల్డ్ స్టోరేజి-అవసరాన్ని బట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్-తొలి ఏడాది సహకార రంగం పునరుద్ధరణ-రెండో ఏడాదినుంచే సహకార డెయిరీకి పాలుపోసే ప్రతి రైతుకు లీటర్ కు రూ 4 సబ్సిడీ-వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు-ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి రూ 5లక్షలు వైఎస్సార్ భీమా…
గత 4ఏళ్లలో అమలైందిలా… వైఎస్సార్ రైతుభరోసా-ఇచ్చినమాట ప్రకారం కేంద్రం ఇచ్చే రూ 6వేలు కలిపి ప్రతిరైతుకు రూ 18,500కు, ఇంకో రూ 1000కలిపి 19,500ఇవ్వకుండా, కేవలం రూ 12,500మాత్రమే ఇవ్వడం ‘‘జగన్మోసమే’’.. 4ఏళ్లలో రూ 19,200కోట్లు రైతులకు ఎగ్గొట్టారు. మొదట 64లక్షల మంది రైతులకిస్తామని నమ్మించి 20లక్షల మందికి ఎగ్గొట్టారు..15లక్షల మంది కౌలురైతులుంటే అందులో పదోవంతు మందికి కూడా ఇవ్వలేదు..కులాల కుంపటి రైతుల్లోనూ రగలించారు. కొన్నికులాల రైతులకే భరోసా ఇస్తామని చెప్పి మిగిలిన కులాలకు ఎగ్గొట్టి ‘‘రైతుల్లోనూ కులచిచ్చు పెట్టిన పాపం జగన్ రెడ్డిదే’’..
సున్నా వడ్డీ రుణాలు, పావలా వడ్డీ రుణాలకు ఎగనామం పెట్టాడు. ప్రతి ఏటా సున్నావడ్డీకి రూ 3వేల కోట్లు కావాలన్న పెద్దమనిషే ఏ బడ్జెట్ లోనూ 100కోట్లు పెట్టిన పాపాన పోలేదు..తన తండ్రి పెట్టిన పావలా వడ్డీ పథకాన్ని కూడా నీరుగార్చాడు. ఈ 4ఏళ్లలో ఉచితంగా బోర్లు ఎంతమందికేశారు..? పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్ ను ఉత్తిత్తి విద్యుత్ చేశాడు, రోజుకు నాలుగైదు గంటలు కూడా కరెంటు ఏపి రైతులకివ్వడం లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అవహేళనే అందుకు అద్దం పట్టింది… ఆక్వారంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారు. రూ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఎక్కడ..? రూ 4వేల కోట్లతో విపత్తుల సహాయనిధి ఎక్కడ..? ఏ అసెంబ్లీలోనైనా ఈ 4ఏళ్లలో ఒక్క కోల్డ్ స్టోరేజి కట్టాడా..? ఒక్కో అసెంబ్లీకి ఒకటి చొప్పున 175కోల్డ్ స్టోరేజీలు కట్టారా..? ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు పెట్టారా..? సహకార రంగాన్ని పటిష్టం చేయడం దేవుడెరుగు, ఉన్నదాన్నే సర్వనాశనం చేశారు..అముల్ డెయిరీ ముసుగులో పాడిరైతులను దారుణంగా మోసం చేశారు.. ఒంగోలు డెయిరీ, సంగం డెయిరీ, ఇతర డెయిరీలపై కక్ష సాధింపునకు పాల్పడ్డారు. సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ నరేంద్రను అక్రమంగా జైల్లో పెట్టారు.
ఏపిలో పాడి పరిశ్రమను చావుదెబ్బ తీశారు..గుజరాత్ అముల్ డెయిరీ కోసం ఏపిలోని డెయిరీలను నాశనం చేశారు. 11,711 గ్రామాల్లో అముల్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు, భవనాల నిర్మాణానికి, ఇతర సౌకర్యాల కల్పనకు రూ 3వేల కోట్లు ఖర్చుచేశారు. అప్పు తీసుకుని మరీ అముల్ ను ఉద్ధరించడం, ప్రభుత్వ సిబ్బందితో చాకిరీ చేయించడం గమనార్హం. అముల్ చెల్లించే ధర కన్నా రూ 6-రూ 10ఎక్కువే ఇతర డెయిరీలు చెల్లిస్తున్నాయి..గుజరాత్ కంపెనీల (అముల్) కిచ్చిన భూములు, భవనాలు ఏపిలో ప్రైవేటు డెయిరీలకిస్తే తాము మరో రూ 10 ఎక్కువ ఇస్తామంటున్నా, జగన్ ప్రభుత్వ ఆసక్తి అముల్ పై ఎందుకో బహిరంగ రహస్యమే..
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ‘‘రుణఉపశమనం’’ జీవో 38రద్దుచేసి 33లక్షల మంది రైతులకు రూ 7,582కోట్లు ఎగ్గొట్టారు. ‘‘అన్నదాత సుఖీభవ’’ స్కీమ్ రద్దుచేశారు. ప్రతిఏటా రూ 15వేల వంతున 5ఏళ్లలో ఒక్కోరైతుకు వచ్చే రూ 75వేలు దూరం చేశారు. 4,5 విడతల రుణమాఫీ ఎగ్గొట్టి ఒక్కో రైతుకు మరో రూ 40వేలు దూరం చేశాడు. రాష్ట్రంలో ప్రతి రైతుకు రూ లక్షా 15వేలు ఎగ్గొట్టిన రైతుద్రోహి జగన్ రెడ్డి.. 64లక్షల మంది రైతులకు రూ 30వేల కోట్లు ఎగ్గొట్టారు.
‘‘రైతు భరోసా’’ కింద రూ 13, 500ఇస్తానని చెప్పి, అందులో రూ 6వేలు ఎగ్గొట్టి రూ 19,200కోట్ల నష్టం చేశాడు రైతులకు. 5ఏళ్లకు ఒక్కో రైతుకు రూ 30వేలు మోసం చేశాడు.
ఈ 4ఏళ్లలో జగన్ రెడ్డి రైతులకిచ్చింది గోరంతే, ఎగ్గొట్టింది కొండంత…
రుణఉపశమనం కింద రావాల్సిన రూ 7,582కోట్లు ఎగ్గొట్టాడు. అన్నదాత సుఖీభవ కింద రావాల్సిన రూ 30వేల కోట్లు ఎగ్గొట్టాడు..ఒక్కో రైతుకు రూ 12,500ఇస్తానని చెప్పి రూ 6వేలు మాత్రమే ఇచ్చి రూ 19,200కోట్లు ఎగ్గొట్టాడు..ఇన్ పుట్ సబ్సిడీలు రూ 4వేల కోట్లు ఎగ్గొట్టాడు. విపత్తు సహాయ నిధి రూ 4వేల కోట్లు ఎగ్గొట్టాడు. క్రాప్ ఇన్సూరెన్స్ రూ 4వేల కోట్లు ఎగ్గొట్టాడు. సున్నావడ్డీ రుణాలు రూ 3వేల కోట్లు ఎగ్గొట్టాడు, పావలా వడ్డీ రుణాలు రూ 1000కోట్లు ఎగ్గొట్టాడు..‘‘రైతురథం’’ రద్దు చేశాడు, రైతులకు ట్రాక్టర్లు, రొటోవేటర్లు, కట్టర్లు, కోతమిషన్లు, ఆధునిక పరికరాలకు ఎగనామం పెట్టి రూ 1500కోట్లు ఎగ్గొట్టాడు. సూక్ష్మసేద్యం సబ్సిడీ ఎత్తేసి రూ 1000కోట్లు నష్టం చేశాడు..గతంలో రైతులకిచ్చిన అనేక రాయితీలు, సబ్సిడీలను దూరం చేసి వేలకోట్ల నష్టం చేశాడు..అంటే ఈ 4ఏళ్లలో రైతులకిచ్చిందానికన్నా రెట్టింపు నష్టం చేశాడు. దాదాపు రూ లక్ష కోట్లు ఎగ్గొట్టాడు రైతులకు..
పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ఏ ఏడాది టార్గెట్ చేరిన దాఖలాలు లేవు. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు వందలకోట్లు పేరబెట్టారు. పత్తి, మిర్చి, శనగ, ఏ పంటకూ సరైన రేటు దక్కక, పెట్టుబడులు పెరిగిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అదే టిడిపి హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ 3,556కోట్లతో 10లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొని రైతులను ఆదుకున్నారు.
టిడిపి హయాంలో వ్యవసాయ బడ్జెట్ ను మూడు,నాలుగు రెట్లు పెంచారు. 5ఏళ్లలో రూ 81వేల కోట్ల బడ్జెట్ పెట్టారు వ్యవసాయానికి. ప్రతి ఏటా 11%వృద్ది సాధించారు. రైతురథం కింద ట్రాక్టర్లు పంపిణీ చేశారు. విపత్తు బాధిత రైతాంగానికి రూ 4వేల కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. రూ 4వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారు. హుద్ హుద్ , తిత్లి తుఫాన్, పెథాయ్ ఇతర విపత్తుల్లో పంట నష్ట పరిహారం పెంచి రైతులను ఆదుకున్న చరిత్ర చంద్రబాబుది..ధాన్యం రైతులకు పరిహారం హెక్టారుకు రూ 16వేల నుంచి రూ 20వేలకు పెంచారు.
జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏపిలో 29.43లక్షల రైతుల కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి.. (తెలంగాణ కన్నా 5లక్షల కుటుంబాలు ఎక్కువ)..అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఏపి వాటా 6.3%వుంటే పండిన ఆహారధాన్యాల్లో వాటా 3.7%మాత్రమే..
వ్యవసాయ సేవలకు విదేశీ పెట్టుబడులు రాబట్టడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గత రెండేళ్లలో తెలంగాణకు దేశంలోనే అత్యధికంగా 49.44మిలియన్ డాలర్లు వస్తే ఏపికి కి వచ్చింది 0.12మిలియన్ డాలర్లు మాత్రమే..
వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ నిర్వీర్క్యం అయ్యాయి..హార్టీకల్చర్, ఆక్వా, యానిమల్ హజ్బెండరీ, సెరికల్చర్ అన్నింటినీ దెబ్బతీశారు.
రైతులకిచ్చే, స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలను కూడా ఈ 4ఏళ్లలో ఎగ్గొట్టారు. ఏటా రూ 150కోట్లు ఇవ్వడానికి కూడా వీళ్లకు చేతులు రాలేదు…
చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘‘రైతు బంధు’’ పథకాన్ని అటకెక్కించారు.. మార్కెట్ కమిటీలనుంచి ఏడాదికి రూ 500కోట్లకు పైగా రుసుముల వసూలు చేస్తున్నా సున్నా వడ్డీ రుణాలకు పైసాకూడా విదల్చలేదు. మార్కెట్ కమిటీలను 191నుంచి 218కి పెంచినా ఒక్కచోటా 4ఏళ్లలో ఏ ఒక్కరైతుకు రుణం ఇచ్చిన పాపాన పోలేదు. మార్కెట్ రుసుము ఏడాదికి రూ 500కోట్లకు పైగా ఖజానాలో జమచేస్తున్నా రైతులకు రిక్తహస్తం..
తత్ఫలితమే ఏపిలో రైతులు అప్పుల ఊబిలో కుంగిపోయారు..దేశంలో అత్యధిక రుణభారం ఏపీ రైతులపైనే..ఒక్కో రైతు కుటుంబ తలసరి అప్పు రూ 2,45,554కు పెంచిన ఘనత జగన్ రెడ్డిదే. జాతీయ స్థాయిలో రూ 74,121వుంటే, దానికన్నా ఏపిలో 231% ఎక్కువని లోక్ సభలో కేంద్రమంత్రి భాగవత్ కరాడ్ జవాబే బైటపెట్టింది..
వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపుల్లో సగం ఖర్చు పెట్టిన దాఖలాలేదు..సేద్యంపై పూర్తి చిన్నచూపు చూశారు..పంటబీమా కేటాయింపుల్లో కోతపెట్టారు. సూక్ష్మసేద్యం 3ఏళ్లుగా అటకెక్కించారు.. మెకనైజేషన్ 4ఏళ్లుగా పక్కనెట్టారు…రైతుభరోసాకు 4ఏళ్లలో రూ 27వేల కోట్లు ఖర్చుచేశామని చెప్పినా రాష్ట్ర ఖజానా నుంచి పెట్టింది రూ 15,600కోట్లే..గత రెండేళ్ల వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు చేసింది రూ 46.40%, 59.86% మాత్రమే..
గతేడాది 16లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గడం రైతుల్లో నెలకొన్న నిర్వేదానికి, వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. 4ఏళ్లలో రైతులకు భవిష్యత్ పై భరోసాకే తూట్లు పొడిచిన క్రెడిట్ జగన్ రెడ్డిదే..
సాగునీటి ప్రాజెక్టులపై సిఎం జగన్ నిర్లక్ష్యం, రాష్ట్రానికి తీరనిశాపం.. చంద్రబాబు హయాంలో సాగునీటి రంగానికి రూ 64వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో ఖర్చు చేసింది రూ 19,676కోట్లు. 2024నాటికి 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు, కానీ 2 ప్రాజెక్టులే(నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి) మాత్రమే పూర్తి చేశారు.
వెలిగొండకు ఇంకా రూ 4వేల కోట్లు కావాలి, ఈ బడ్జెట్ లో పెట్టింది రూ 101కోట్లే..గత ఏడాది సాగునీటి రంగానికి బడ్జెట్ రూ 9,810కోట్లు పెట్టి, 10నెలల్లో ఖర్చుచేసింది రూ 3,514కోట్లే..కేటాయింపుల్లో మూడోవంతు కూడా ఖర్చుచేయలేదు..
చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణపనులకు ఏడాదికి రూ 11,178కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ 5వేల కోట్లు కూడా లేదు. ఇదీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ కున్న శ్రద్ధ..
రాయలసీమ ఎత్తిపోతల పథకం మూలనపడేశారు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాలికొదిలేశారు. వెలిగొండ ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. వంశధార రెండోదశ, 2వ భాగం పనులు నత్తనడక. హంద్రీ నీవా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు. గాలేరు నగరి రెండో దశ ఎప్పటికి..
అటు వ్యవసాయం, ఇటు నీటిపారుదల రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతుల రెండు రెక్కలు విరిచేసిన ఘనత సీఎం జగన్ రెడ్డిదే..
విపత్తుల్లో నష్టపోయిన పంటలకు ప్రభుత్వ సాయం అందక, కళ్లెదుటే పెట్టుబడులన్నీ దండగై నైరాశ్యంలో మునిగిన అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపి 3వ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ సిఆర్ బి)నే చెప్పింది. అన్నదాతల బలవన్మరణాలు ఏటా 19% పెరగడం ఆందోళనకరం.. 2018లో ఏపిలో రైతు ఆత్మహత్యలు 664వుంటే, 2019నుంచి ప్రతిఏటా ఈ 4ఏళ్లలో 1100-1400కు పెరిగాయని ఈ నివేదికలే చెబ్తున్నాయి. కానీ వాస్తవంగా చూస్తే క్షేత్రస్థాయిలో రైతు ఆత్మహత్యలు దీనికెన్నో రెట్లు ఎక్కువ. రైతుల్లో నిరాశా నిర్వేదాలను ఏమాత్రం రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన పథకాలు తగ్గించలేదంటే, బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయలేదంటే, వారిలో భరోసాను పెంచలేక పోతున్నాయంటే, వైసిపి ప్రభుత్వపరంగా రైతుల సంక్షేమానికి చేస్తున్నదంతా, మొక్కుబడే..
జగన్ నవరత్నాల్లో మొదటి రత్నం రైతుభరోసా ‘‘నకిలీరత్నం’’ అనడానికింతకన్నా ప్రత్యక్ష సాక్ష్యాలు ఏం కావాలి..? మిగిలిన 8రత్నాలు కూడా నకిలీవే అనడంలో సందేహమే లేదు… ‘‘నవరత్నాలు కావివి నవమోసాలు- జగన్మోసాలని’’ జనం అందరికీ ఇప్పటికే అర్ధమైంది. దీనికెప్పుడెప్పుడు గుణపాఠం చెబుదామా అని ఎదురెదురు చూస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!
కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...