జగన్ రెడ్డి పాలనలో దళిత, గిరిజన బ్రతుకుల గాంఢాంధకార చీకట్లు అలుముకున్నాయి. కేంద్ర విడుదల చేసే సబ్ ప్లాన్ నిధులను సైతం నవరత్నాల వైపు మరల్చి నిలువన మోసం చేశారు. జగన్ నాలుగునరేళ్ళ పాలనలో ఎస్సీలకు..ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పాలి. గతంలో కూడా దళితులు రోడ్డెక్కి ఇదే అంశాన్ని లేవనెత్తారు. దళిత.., గిరిజనుల అభ్యన్నతికి కేటాయించి సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మరిలించడం ఏంటీ..? ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం కాదా..? అని నినదించారు. ఎన్ని నిరసనలు వ్యక్తం చేసిన నేటికి ఆ నిధులు పక్కదారిపట్టిపోతునే ఉన్నాయి. ఇదే అంశాన్ని కేంద్రానికి ఎంపీ లు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం. నేటికి వేల కోట్ల సబ్ ప్లాన్ కింద కేంద్ర విడుదల చేసిన నిధులను వాటికి ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తునే ఉన్నారు. మరో వైపు తెలంగాణలో సబ్ ప్లాన్ నిధులతోపాటు.., అదనపు నిధులు కేటాయించి దళిత బంధువును అమలుచేస్తోంది. కానీ ఏపీలో నాలుగుగేళ్లల్లో దాదాపు సబ్ ప్లాన్ నిధుల కింద కేటాయించిన దాదాపు 18 వేల కోట్లను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. దళితులకు బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని కేంద్రానికి చట్టసభలో టీడీపీ ఎంపీలు మోరపెట్టుకున్న దానిపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దళిత, గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పించడం.., ఆయా ప్రాంతాల్లో మౌళిక వసతులకు ఈ నిధులు ఖర్చు చేస్తుంటాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఏపీలో ఇందుకు విరుద్దం. ఈ నిధులను ఎటువంటి కనికరంలేకుండా నవరత్నాలకు ఖర్చు చేస్తోంది జగన్ ప్రభుత్వం. అయితే అంతా తెలిసి కూడా బీజేపీ పెద్దలు జగన్ తీరుపట్ల వ్యవహరించిన తీరు నేటికీ విస్మయానికే గురిచేస్తోంది. జగన్ పై ఉన్న ప్రేమలో 10 శాతం దళితులపై బీజేపీ చూపితే వారి జీవితాల్లో ఎపుడో వెలుగులు నిండేయేనని వాదన లేకపోలేదు.
ఇదిలా ఉంటే ఏపీలో దళితులకు రాజ్యాంగ పరంగా వారికిచ్చిన నిధులను పక్కదారి పట్టించడమేకాక..,వారి హక్కులను కాలరాస్తున్నారు. వారి భూములను లాక్కొని దిక్కునవారికి చెప్పుకోమని వైసీపీ నేతలు హుకూం జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రశ్నించిన వారి దాడులు చేసి.., శిరోముండనాలు చేస్తున్నారు. కాదంటే కేసులు పెట్టి.. జైలుకు పంపుతున్నారు. అదికాకుంటే చంపి కారులో డోర్ డెలవరీ చేయడం అనవాయితీగా మారింది.











