అవగాహన లేకపోవటం, అంతకంటే ముఖ్యంగా అనుభవం లేకపోవటం సీఎం జగన్ కు చాలా సార్లు
ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవటం కూడా తెలికపోవటం ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలనూ ఇబ్బందులులకు గురి చేస్తోంది. సందు దొరికినప్పుడల్లా చంద్రబాబునో, పవన్ కళ్యాణ్‌నో పనిగట్టుకు తిట్టే సీఎం గారికి ఢిల్లీలో పలుకుబడి కూడా అంతంత మాత్రమేనని మరో సారి స్పష్టమైంది.
నదీజలాల పంపిణీ విషయంలో సరైన ప్రతిపాదనలు ఇవ్వటం, కేంద్రానికి అసలు విషయం చెప్పటంలో అవగాహన లేకపోవటంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సరిపడా నీరివ్వడం, అందడం లేదని కేంద్రానికి సీఎం జగన్ పలు మార్లు ప్రతిపాదనలు పెట్టారు.
సీమకు నీళ్లిచ్చే విషయంలో సీఎం అభ్యర్థనలను కేంద్రం తోసిపుచ్చింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా రాష్ట్రానికి ముఖ్యంగా సీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. కృష్ణా నదీ జలాల పంపిణీపై ఓ ముందడుగు పడినా, ఈ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేనా అన్న అనుమానాల నేపథ్యంలో నీటి పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ప్రతిపాదనలను సూచించింది. అందులో ముఖ్యంగా 811 టీఎంసీలు, అదనపు జలాలు, పోలవరం ద్వారా కృష్ణాకు తరలించే నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు సూచించింది. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా జలాలలో న్యాయబద్ధమైన వాటా కోల్పోయింది.. ఈ కారణంగా… రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం తప్పదు
సీమ వాసులకు నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. ముఖ్యమంత్రి జగన్ అసమర్ధత, చేతకాని తనం వల్ల కృష్ణా మిగులు జలాల వినియోగంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఏపీకి, ముఖ్యంగా రాయలసీమకు జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు సీఎం తెలియజేయాలని డిమాండ్లు మొదలయ్యాయి.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











