భారతదేశానికి సదా స్మరణీయుడు మహాత్ముడు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ వర్ధంతి సందర్భంగా.. శనివారం ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రెండు నిముషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. మౌనం పాటించడం ద్వారా మహాత్ముడి పవిత్ర స్మృతికి నివాళి అర్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ రోజున అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పాటించనున్నారు. ఈ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల మౌనం పాటించడం గురించి రాష్ట్రాలకి కేంద్రం సూచన చేసింది. దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎక్కడివారు అక్కడే 11 గంటలకు పనులు, కదలికలు ఆపివేయలని సూచన చేశారు. ప్రారంభ ముగింపు సమయాల్లో సైరన్లు, తుపాకుల శబ్దాలు మోగించి.. మౌనం పాటించేలా అందరినీ అప్రమత్తం చేయాలని కూడా సూచించారు.
స్వాతంత్రోద్యమం, జాతీయ సమైక్యత పై సమావేశాలు జరపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లోనూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కేంద్రం సూచించింది.
Must Read ;- ఓ మహాత్మా.. ఓ మహర్షీ.. : అహింసే ఆయన ఆయుధం











