ఒక వైపు కరోనా మరణాలు సంభవిస్తుంటే.. మరో వైపు ఆక్సిజన్ కొరతో మరిన్ని మరణాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చెంగల్‌పట్టుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ర్టల్లో ఆక్సిజన్ అందక ఎక్కువగా మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










